గురుచంద్రుల కలయిక... ఈ రాశులపై కనక వర్షం

గ్రహాల మార్పు వల్ల ప్రతి రాశిపై ప్రభావం ఉంటుంది. గురుడు, చంద్రుడు కలయికవల్ల గజకేసరి యోగం ఏర్పడబోతోంది. ఈనెల 13, 14 తేదీల్లో కొన్ని రాశులవారికి ఈ యోగంవల్ల అదృష్టం బాగా పట్టుకుంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అన్ని పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారని, ప్రతి పనిలోను అదృష్టం తోడుంటుందని తెలియజేస్తున్నారు. ఆ రాశుల వివరాలు తెలుసుకుందాం.

మీనరాశి
వీరికి బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవిస్తారు. చేపట్టే ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పుంజుకుంటారు. గురుచంద్రుల కలయిక ఈ రాశివారికి భారీగా ఆర్థిక లాభం తెచ్చిపెట్టనుంది.

కర్కాటకరాశి
వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. బలం రెట్టింపవుతుంది. ఆస్తులు పెరుగుతాయి. ఏపని తలపెట్టినా విజయం సాధిస్తారు. పనిచేసే ప్రదేశంలో పై అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది.

six zodiac signs get super financial benefits due to jajakesari yoga 2024

వృశ్చిక రాశి
మంచి గౌరవాన్ని పొందుతారు. ఈ యోగంవల్ల ఆగిపోయిన పనులన్నింటినీ పూర్తిచేయగలుగుతారు. పనిచేసేచోట ప్రోత్సాహం లభిస్తుంది. కోరకున్నవన్నీ దొరికే సమయం ఇది. ఎవరైనా శత్రువులున్నా మీ ముందు ఓటమిపాలవుతారు.

తులారాశి
ఆర్థికంగా కలిసివస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభాలున్నాయి. సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.

మిథునరాశి
వీరికి మంచి లాభాలున్నాయి. ఆర్థికంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పనిచేసేచోట కలిసివస్తుంది. పై అధికారుల నుంచి మన్ననలను అందుకుంటారు.

మేషరాశి
తల్లిదండ్రుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపారంలో భారీ లాభాలున్నాయి. జీవితం సాఫీగా సాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+