తులారాశిలో, స్వాతి నక్షత్రంలో కుజుడి సంచారం.. ఈ రాశులకే
జ్యోతిష్యం ప్రకారం కుజుడు తులారాశితోపాటు స్వాతి నక్షత్రంలో కూడా సంచారం చేస్తాడు. ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. దీని ప్రకారం మొత్తం 12 రాశులపై ప్రభవం ఉంటున్నప్పటికీ ప్రధానంగా ఆరు రాశులకు మాత్రం బాగా కలిసివస్తుంది. ఏయే రాశులకు ఏ విధంగా కుజుడి సంచారం కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మకర రాశి
వ్యాపారస్తులకు నష్టాలున్నాయి. విష్ణు సహస్ర నామ పారాయణం చేయాలి. తులసి చెట్టు దగ్గర ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేయాలి. తులసిచెట్టుకు ప్రదక్షిణ చేయాలి. అనుకోకుండా బాధ్యతలు పెరుగుతాయి. బండి నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తెలివిగా వ్యవహరించడం నేర్చుకోవాలి.

కుంభ రాశి
గొడవలు ఏర్పడతాయి. తొందరపడి మాట ఇవ్వకూడదు. ఓం నమ: శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు పఠించాలి. దీనివల్ల మనసు కుదుటపడుతుంది. కోపాన్ని నియంత్రించుకోకపోతే గొడవలు జరుగుతాయి. మానసికంగా ప్రశాంతతను కోల్పోతారు. ఆకస్మికంగా ఖర్చులు పెరుగుతాయి.
మీన రాశి
ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధించాలి. వ్యాపారస్తులకు నష్టాలున్నాయి. ఎవరు ఎంత గట్టిగా మాట్లాడినా మౌనంగా ఉండటం ఉత్తమం. కష్టపడిన దానికి ప్రతిఫలం లభించదు. పని ఒత్తిడి పెరుగుతుంది. టెన్షన్ పడతారు. కెరీర్ పరంగా మార్పులున్నాయి. బాధ్యతలు పెరుగుతాయి. అనవసరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మేషరాశి
ఆచితూచి మాట్లాడాలి. ఉద్యోగస్థులకు పనిభారం పెరుగుతుంది. ఎవరు ఎలా మాట్లాడినా స్పందించకూడదు. లేదంటే వివాదాలకు దారితీస్తాయి. మంగళవారం హనుమంతుడికి వడమాల సమర్పించి ఆకుపూజ చేయించండి. దీనివల్ల కుజుడు శాంతిస్తాడు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని అలవాటు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటారు. కార్యాలయంలో అవమానం ఉంది.
కర్కాటక రాశి
ఇతర విషయాల్లో ఉద్యోగస్థులు కల్పించుకోకూడదు. దుర్గామాతను పూజించాలి. అమ్మవారికి పాయసం నైవేద్యంగా సమర్పిస్తే కలిసివస్తుంది. కుటుంబంలో వివాదాలు తలెత్తుతాయి. ఆస్తి వివాదాలతోపాటు అనారోగ్య సమస్యలున్నాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు.
తులా రాశి
బంధువు, మిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. శనివారం రోజు శనిదేవుడికి తైలాభిషేకం చేయించాలి. నవగ్రహలకు ప్రదక్షిణ చేయాలి. రక్తపోటు లేదంటే ఆకస్మిక గాయాలు అవుతాయి. జ్వరం వస్తుంది. మీవల్ల లాభం పొందినవారు కూడా మీకు శత్రువులుగా మారతారు. ఆంజనేయుడిని ఆరాధించాలి.












Click it and Unblock the Notifications