కష్టపడి పనిచేసి కోటీశ్వరులయ్యే రాశులు వీరే

ఉగాది పర్వదినం అంటేనే తెలుగు నూతన సంవత్సరాది. ఏప్రిల్ నుంచి ఖగోళంలోని అన్ని గ్రహాలు తమ రాశులను మార్చుకుంటుంటాయి. ఇప్పటికే కొన్ని గ్రహాలు రాశులను మార్చాయి. ఇలా సంచారం చేసే సమయంలో ఆయా రాశులవారు తమ స్వయంకృషితో జీవితంలో అందలాలు ఎక్కే అవకాశం ఉంది. డబ్బులు సంపాదించడంలో ముందుంటారు. ఎందుకంటే గ్రహాలు ఆయా రాశిచక్ర గుర్తులకు అనుకూలంగా ఉంటాయి. ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుంది, కష్టపడి కోటీశ్వరులయ్యే రాశుల వివరాలను తెలుసుకుందాం.

తులారాశి
స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు, ఇతర ఆర్థికరంగ లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టి అత్యధిక లాభాలను ఆర్జిస్తారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలున్నాయి. ఉద్యోగంలో పైకి వస్తారు. తక్కువ శ్రమతో మంచి ఫలితాలను అందుకుంటారు.

six zodiac signs will get all financial benefits and become millionaires due to planets transit changes after march 2025

వృశ్చిక రాశి

ఈ రాశివారు కూడా స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు, ఇతర ఆర్థికరంగ లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకుంటారు. ఆదాయాన్ని నిరంతరం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒకసారి వీరు నిర్ణయం తీసుకున్నారంటే బ్రహ్మదేవుడు దిగివచ్చినా మార్చుకోరు. పట్టుదల, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ.

మకర రాశి
క్రమశిక్షణతో, పట్టుదలగా లక్ష్యాన్ని చేరుకుంటారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఏ ప్రయత్నాన్ని కూడా మధ్యలో విరమించుకునే గుణం వీరికి లేదు. మార్చి 29వ తేదీ తర్వాత కొత్త లక్ష్యంతో ముందుకు సాగుతారు. అన్ని రంగాల్లో దూసుకువెళతారు. లక్ష్యాన్ని నవంబరులో చేరుకుంటారు.

మేషరాశి
రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వ్యాపారస్తులు, వృత్తిలో ఉన్నవారు ప్రణాళిక ప్రకారం కష్టపడి లక్ష్యాన్ని చేరుకుంటారు. దీనివల్ల ఆదాయం భారీగా పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలపై దృష్టిపెడతారు. వృత్తిలో ఉన్నవారు, వ్యాపారస్తులు, ఉద్యోగాల్లో ఉన్నవారు విదేశీ యానం చేస్తారు. అక్కడే స్థిరపడతారు.

వృషభరాశి
ఒక వ్యూహం ప్రకారం పనిచేసి ఆదాయాన్ని పెంచుకుంటారు. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలతోపాటు ఇతర లావాదేవీలద్వారా వీరు ఆదాయాన్ని పెంచుకుంటారు. తమ లక్ష్యాన్ని ఏడాది చివరలోగా చేరుకుంటారు.

సింహరాశి
వీరికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఒక కంపెనీని ప్రారంభిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. అందరితో సంబంధాలు ఏర్పడతాయి. సంపన్నుల జాబితాలో చేరతారు. లక్ష్యాన్ని అక్టోబరులోకా చేరుకుంటారు. ఉద్యోగస్థులు ప్రమోషన్స్ పై దృష్టిపెడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+