ఈ రాశుల సుడి తిరిగింది... 18 నెలలు మహా రాజయోగం
నవగ్రహాల్లో కీలక గ్రహమైన రాహువు అంటే అందరూ భయపడతారు. కానీ రాహువు మంచి చేస్తుందనే విషయం చాలామందికి తెలియదు. 2025 మే 18వ తేదీన రాహువు మీన రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ 18 నెలలు సంచారం చేస్తాడు. ఈ రాశిలోకి రాహువు ప్రవేశించినప్పుడు కొన్ని రాశులవారి ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి. ధనధాన్యాలు, రాజయోగాలు సమృద్ధిగా లభిస్తాయి. ఆ భోగభాగ్యాలను అందుకునే రాశుల వివరాలను తెలుసుకుందాం.
ధనుస్సు
అర్ధాష్టమ శని దోషం తొలిగిపోతుంది. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆదాయం భారీగా పెరుగుతుంది. నిరుద్యోగులతోపాటు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారు కూడా కొత్త అవకాశాలను అందుకుంటారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలితాలనిస్తాయి. అదృష్టం తోడుండటంతోపాటు రాహువు అనుగ్రహం వల్ల ఈ రాశివారు మంచి స్థాయికి చేరుకుంటారు.

మిథునం
నిరుద్యోగులకు విదేశాల నుంచి అవకాశాలు తలుపు తడతాయి. విదేశీ సంపాదను అనుభవించే యోగం ఈ రాశులకు కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు. తండ్రివైపు నుంచి ఆస్తి కలిసివస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు కలిసివస్తాయి.
కన్య
అనారోగ్యం నుంచి బయటపడతారు. ఆర్థిక సమస్యల నుంచి, శత్రువల నుంచి ఎదురయ్యే సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలున్నాయి. ఆస్తికి సంబంధించిన గొడవలన్నీ సద్దుమణుగుతాయి. సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటారు. న్యాయపరమైన కేసులన్నీ తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది.
మేషం
వీరికి ఏలిన నాటి శని ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో మంచి పురోగతి ఉంది. నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించాలి. వ్యాపారాల్లో మంచి లాభాలున్నాయి. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. అవి లాభసాటిగా మారతాయి.
మకరం
ఆదాయం భారీగా పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వాటి విలువ కూడా రెట్టింపు అవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు ఉన్నాయి. వ్యాపారంలో వచ్చే కష్టాల నుంచి బయటపడతారు. ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా విదేశాలకు వెళతారు.
సింహం
వృత్తి, వ్యాపారాల్లో వీరికి తీరిక ఉండదు. షేర్లలో పెట్టుబడి పెడతారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తిలోకానీ, వ్యాపారంలోకానీ క్షణం తీరిక ఉండదు. ప్రేమ వ్యవహారాల్లో పెద్దల నుంచి సానుకూలత వస్తుంది. మీ జీవన విధానం మొత్తం మారిపోయి లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తారు.












Click it and Unblock the Notifications