విజయ దశమి నుంచి ఈ రాశుల జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణం

దసరా నవరాత్రులు అక్టోబరు మూడోతేదీ నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయి. ఈ సమయంలో బుధుడు, చంద్రుడు రాశులు మారుస్తారు. అలాగే 11వ తేదీ నుంచి బృహస్పతి తిరోగమనంలో ఉంటాడు. ఈ పరిణామాలవల్ల కొన్ని రాశులకు అద్భుత యోగాలు అందుతాయి. వీరు ఏ పని తలపెట్టినా విజయం సాధించడంతోపాటు ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటారు. అందుకు వీరికి అదృష్టం తోడుంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగడంతోపాటు శుభవార్తలు వినడం, పెళ్లి సంబంధాలు కుదరడంలాంటివి చోటుచేసుకుంటాయి. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

తుల
ఏ పని తలపెట్టినా విజయం దక్కుతుంది. వడ్డీ వ్యాపారాలు, స్టాక్ మార్కెట్లు, షేర్లు వంటివి లాభాలనిస్తాయి. పెళ్లిళ్ల కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంది.

six zodiac signs will get more money and get happy life due to vijaya dasami october 3rd to 12th

కన్య
వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని తలపెట్టినా విజయం సాధించడంవల్ల కుటుంబంలోని పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఆస్తులు కలిసివస్తాయి. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది.

మకరం
కుటుంబ జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో అధికార యోగం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో ఒకటి నుంచి రెండు వరకు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఎదురుచూస్తున్న శుభవార్త అందుతుంది. కలలో కూడా ఊహించనిరీతిలో లాభం కలుగుతుంది.

కుంభం
దసరా నుంచి వీరి జీవితం నిత్య కల్యాణం, పచ్చతోరణంలా సాగుతుంది. అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వృత్తితోపాటు వ్యాపారాలు కూడా కలిసివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి ఢోకా లేదు. అనేక విధాలుగా ఆదాయం పెరగడంతోపాటు డబ్బు చేతికి అందుతుంది. ఎక్కువ శుభవార్తలు చెవిన పడతాయి.

వృషభం
నవరాత్రుల్లో ఈ రాశివారికి ఊహించనిరీతిలో అదృష్టం పడుతుంది. గురువు తిరోగమనంలో ఉండటంవల్ల ధనలాభం ఉంది. ఉద్యోగంతోపాటు వ్యాపారం, వృత్తిలో ఉన్నవారు తమ సమర్థవంతమైన పనితీరుతో డబ్బును సంపాదిస్తారు. ఈ తొమ్మిదిరోజుల్లో వీరు తీసుకునే నిర్ణయం విజయాన్ని అందిస్తుంది.

మిథునం
వీరికి ఒకటికి రెండుసార్లు ధనయోగాలున్నాయి. ఎందుకంటే బుధుడు సూర్యుడితో, శుక్రుడితో కలుస్తాడు కాబట్టి. ఉద్యోగంలో మంచి హోదా లభిస్తుంది. ప్రముఖుల నుంచి గుర్తింపు పొందుతారు. దీనివల్ల ధనలాభం కూడా ఉంది. కుటుంబంలో శుభకార్యాలున్నాయి. వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+