కొత్త ఏడాది మొదటి సూర్యగ్రహణం.. ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం!

2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం రోజున అనేక శుభ పరిణామాలు జరగబోతున్నాయి. అరుదైన ఖగోళ దృశ్యాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ఏర్పడి సాయంత్రం 6 గంటల 13 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణంగా ఉంటుంది.

2025 సంవత్సరంలో సూర్య గ్రహణం
ఇక 2025 వ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ మాసంలో 21వ తేదీన ఏర్పడుతుంది. ఇది కూడా పాక్షిక సూర్యగ్రహణం గానే ఉంటుంది. ఇక 2025 మార్చి 29వ తేదీన శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేస్తాడు. శనీశ్వరుడు రాత్రి 11 గంటలకు కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహాల సంచారంలో మార్పులు, సూర్యగ్రహణం ప్రభావంతో కొన్ని రాశుల వారు అదృష్ట రాశులుగా మారుతున్నారు.

Solar eclipse 2025 First solar eclipse on march 29th these zodiac signs have golden future

మిధున రాశి
2025 సంవత్సరంలో ఏర్పడే మొదటి సూర్యగ్రహణం కారణంగా మిధున రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఈ సంవత్సరం మిధున రాశి వారు ఏ పని చేసినా సరే విజయాలు సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇల్లు కొనాలనుకునే వారి కోరిక తీరుతుంది. ఇది మిధున రాశి వారికి అన్నింట కలిసి వచ్చే సమయం.

ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి మొదటి సూర్యగ్రహణం అదృష్టాన్ని తెస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో ఊహించని ఆదాయాన్ని పొందుతారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది ధనుస్సు రాశి వారికి మంచి సమయం వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇది ధనుస్సు రాశి వారికి ఆర్థిక లాభాలను తెచ్చి పెట్టే కాలం.

తులారాశి
మొదటి సూర్యగ్రహణంతో పాటు శని సంచారం కారణంగా తులారాశి జాతకులు ఈ సమయంలో సానుకూల ఫలితాలను పొందుతారు. తులా రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు తులా రాశి వారికి మంచి లాభాలను ఇస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. తులారాశి జాతకులకు ఇది అదృష్ట కాలం.

మీనరాశి
మొదటి సూర్యగ్రహణం మీన రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. మీనరాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించాలనుకునే వారికి ఇదే సరైన సమయం. వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+