సూర్య గ్రహణం: గర్బిణిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గర్భిణి స్త్రీలు :- గ్రహణ సమయంలో జాగ్రత్తలు. వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకని గర్భిణీ స్త్రీలపై ఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్రాలలో చెప్పడం జరిగింది. గర్భవతులు తన శిశువు "పిండం" కడుపులో ఎదుగుతున్న సమయం వారి శరీరానికి ఎలాంటి నెగటివ్ పవర్ ని తట్టుకునే శక్తి ఉండదు. గ్రహణ సమయంలో రోగ నిరోధక శక్తి గర్బములో ఉన్న బిడ్డ కోల్పోతారు అందుకే ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తుంది అని వారిని పెద్దలు బయటకు వెళ్ళనివ్వరు. గ్రహణ సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోవడమే మంచిది. గ్రహణం సమయంలో చేసే దైవ స్మరణ, జపం అనేక రెట్ల శుభ ఫలితాలను ఇస్తాయి.

గ్రహణం పట్టిన నక్షత్రాలలో ముహూర్తాలు:- గ్రహణం పడిన నక్షత్రంలో ఆరు నెలలు శాస్త్ర రిత్య ముహూర్తాలు నిషేధిస్తారు. ప్రస్తుత సూర్యగ్రహణం మూల నక్షత్రం, ధనుస్సురాశిలో ఏర్పడుతుంది.

Solar eclipse: Suggestions for Pregnant Women

పితృ తర్పణాలు :- ఎవరి ఇంట్లో అయిన అదే రోజు ఆబ్ధిక తిధులు వస్తే తప్పక ఆ రోజు మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత చేయ వచ్చును. ఈ రోజు చేస్తే పిత్రుదోషాలు కుడా నివారణ జరుగుతాయి.

గ్రహణ శూల ప్రయాణాలు :- గ్రహణం పట్టిన మరుసటిరోజు ముఖ్యమైనవి, దూర ప్రయాణాలు చేయకూడదు.

గ్రహణ దానాలు:- గ్రహణం తర్వాత మరుసటి రోజు కేవలం గ్రహణ దోషం ఉన్నవారే కాకుండా పన్నెండు రాశుల వారు గ్రహణ దోష నివారణ కొరకు గోధుమలు, ఉలవలు కిలోంపావు చొప్పున తీసుకుని వాటిని నీళ్ళలో నానబెట్టి మరుసటిరోజు నీళ్ళను వడగట్టిన తరవాత వాటికి చిక్కగా బెల్లాన్ని పట్టించి ఆవునకు అరటి ఆకులో కాని ,మోదుగ, తామర ఆకులతో కుట్టిన విస్తరిఆకులో మాత్రమే దాన పెట్టాలి. గోమాత మీరు పెట్టిన గ్రాసం తింటున్నప్పుడు మూడు ప్రదక్షిణలు చేయాలి, ఈ విధంగా భక్తీ శ్రద్దలతో ఎవరైతే చేస్తారో వారికి దైవానుగ్రహం కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+