2వ సూర్య గ్రహణంతో ఈ రాశులవారికి తీవ్రమైన కష్టాలు

సూర్య గ్రహణం, చంద్ర గ్రహణానికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం ఈ రెండింటినీ చెడుగా భావిస్తారు. ఈ గ్రహణాలవల్ల వాతావరణంలో సానుకూలత ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు. 2023లో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడతాయి. ఇప్పటికే ఒక సూర్య గ్రహణం, ఒక చంద్ర గ్రహణం ఏర్పడ్డాయి. మరో రెండు ఏర్పడాల్సి ఉంది. అక్టోబరు 14వ తేదీన రెండో సూర్యగ్రహణం ఏర్పడబోతోంది.

ఇది కంకణాకార సూర్య గ్రహణం అవుతుంది. దీనర్థం ఏమిటంటే.. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేయలేడు. ఆ సమయంలో సూర్యుడు అగ్నివలయంలా కనిపిస్తాడు. మొదటి సూర్య గ్రహణంలానే ఇది కూడా మన దేశంలో కనిపించదు. అలాగే సూతక్ కాలం కూడా చెల్లుబాటవదు. ఈ గ్రహణం కొన్ని రాశులవారిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ రాశులేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

solar eclipse will cause serious trouble for these zodiac sign people

మేష రాశి:ఈ రాశివారికి సూర్య గ్రహణం వల్ల ప్రతికూలతలు ఏర్పడతాయి. అత్యంత దగ్గరగా ఉండే సన్నిహితుల చేతిలో మోసపోవాల్సి వస్తుంది. పనిచేసే ప్రాంతంలో అనేక ఇక్కట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వృషభ రాశి:ఈ రాశివారికి ధన నష్టం కలుగుతుంది. పనిలో హెచ్చుతగ్గులుంటాయి. ఎదుటివారితో మాట్లాడే సమయంలో మాటపై అదుపు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే అనేక అనర్థాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కన్యా రాశి:వీరికి శుభప్రదంగా ఉండదు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండటం అవసరం.

తులా రాశి:ఈ రాశివారిపై గ్రహణవల్ల ఉండే చెడు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. పలు అవమానాలను, చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు ఇప్పటినుంచే మానసికంగా సిద్ధమై ఉండటం మంచిది. ఏ పని చేసినా ఓపికగా చేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+