Solar eclipse2023:అక్టోబర్ లో చివరి సూర్యగ్రహణం; ఈ రాశులవారు జాగ్రత్త!!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలను అశుభకరమైన సంఘటనలుగా చెబుతారు. గ్రహణ సమయంలో సూర్య గ్రహణం అయితే సూర్యుడు, చంద్రగ్రహణం అయితే చంద్రుడు కప్పబడి ఉంటారు. ఇక ఈ పరిణామాలు ద్వాదశ రాశుల వారి జాతకాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో చివరి సూర్యగ్రహణం ఏర్పడనుంది.
అశ్విన్ అమావాస్య రోజున చివరి సూర్యగ్రహణం:అక్టోబర్ నెలలో 14వ తేదీన అశ్విన్ అమావాస్య రోజున చివరి సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ సూర్యగ్రహణం కన్యారాశిలో, చిత్రా నక్షత్రంలో సంభవిస్తుంది. ఈ సూర్య గ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు అనూహ్యమైన ఫలితాలను పొందుతారు. ఈ సూర్య గ్రహణం కొన్ని రాశి జాతకుల జీవితాలలో గణనీయమైన మార్పులకు కారణమవుతుంది. ఈ సమయంలో వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మేష రాశి :అక్టోబర్ 14న రానున్న సూర్యగ్రహణం మేష రాశి జాతకులకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఏకకాలంలో వీరు అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కెరీర్ పరంగా కూడా మేషరాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారి శ్రమ ఆశించిన ఫలితాలను ఇవ్వదు.
సింహరాశి :అక్టోబరు 14న ఏర్పడనున్న సూర్యగ్రహణం సింహరాశి వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉండదు. వారి ఈ సమయంలో జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తమకు అనుకూలంగా లేని వార్తలను వినాల్సి వస్తుంది. ఈ గ్రహణం యొక్క ప్రతికూల ప్రభావాలు సింహరాశి వ్యక్తులకు మానసిక క్షోభకు దారితీస్తాయి. వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. విపరీతంగా ఖర్చులు పెరుగుతాయి. విలువైన ఆస్తులు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందున పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్యారాశి :అక్టోబర్ 14 ఏర్పడనున్న సూర్యగ్రహణం కన్యారాశి జాతకులకు నష్టాలను కలిగిస్తుంది. కన్య రాశి జాతకుల మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. కన్యారాశి జాతకులు ఈ సమయంలో మాట్లాడే మాటలపై నియంత్రణ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. బడ్జెట్ ను కఠినంగా నిర్వహించాల్సిన సమయం ఇది అని చెప్పబడింది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications