త్వరలో షడష్టక యోగంతో ఈ రాశులవారికి లాటరీ తగలబోతుంది.. మీరున్నారా?
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారంతో జరిగే ఖగోళ మార్పులు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఇక జ్యోతిష శాస్త్రంలో ముఖ్య గ్రహాలుగా చెప్పబడే శని మరియు కుజుడు సంచారం ఈ రెండు గ్రహాలు కలిపి ఏర్పరిచే శక్తివంతమైన యోగాలు కూడా అంతే ప్రభావాన్ని చూపిస్తాయి. శని కర్మలకు అధిపతి. మనం చేసే పనులను బట్టి శని మనకు ఫలితాలను ఇస్తాడు.
శని, కుజుల సంయోగంతో షడష్టక యోగం
క్రమశిక్షణ కలిగిన దేవుడైన శని సంచారం మన జీవితంలో అనేక మార్పులను తెస్తుంది. ఇక కుజ గ్రహం కూడా చాలా శక్తివంతమైన గ్రహం. ఈ రెండు గ్రహాలు 150 డిగ్రీల దూరంలో ఉండడంతో షడష్టక యోగం ఏర్పడుతుంది. సెప్టెంబర్ 13వ తేదీన కుజుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత వారం రోజులకు కుజుడు మరియు శని రెండు గ్రహాలు ఒకదానికి ఒకటి 150 డిగ్రీల దూరంలో ఉంటాయి.

షడష్టక యోగంతో అదృష్ట రాశులు
శని, కుజుల కారణంగా ఏర్పడే షడష్టక యోగం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశులవారు ఆకస్మిక ధనలాభాలను పొందుతారు. మరి శని కుజుల సంయోగంతో ఏర్పడే షడష్టక యోగం అదృష్టవంతులు అయ్యే రాశుల గురించి తెలుసుకుందాం.
మేషరాశి
శని కుజుల కారణంగా ఏర్పడే షడష్టక యోగం మేష రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఈ సమయంలో అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. అదృష్టం మీ తలుపు తడుతుంది. ఉద్యోగాలు చేసే వారికి కెరీర్ లో ఊహించని పురోగతి కనిపిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పాత సమస్యలు తొలగిపోతాయి.
మిధున రాశి
మిధున రాశి జాతకులకు శని కుజుల కారణంగా ఏర్పడే షడష్టక యోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు వర్తక వ్యాపారాలలో ఎక్కువ లాభాలు పొందుతారు. మిధున రాశి వారికి వ్యాపారంలో కొత్త ఆర్డర్లు వస్తాయి. మిధున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ఎక్కువ డబ్బులను ఆదా చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు.
మీనరాశి
మీన రాశి జాతకులకు శని కుజుల కారణంగా ఏర్పడే షడష్టక యోగం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో వీరిని నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను గడిస్తారు. పూర్వీకుల నుంచి ఆస్తులు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈ సమయం వీరికి అన్ని విధాల బాగుంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications