త్వరలో వీరి జీవితంలో మిరుమిట్లుగొలిపే సంపదల ప్రకాశం!
జ్యోతిషశాస్త్రంలో గ్రహాలకు సూర్యుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అధికారానికి, తేజస్సుకు, నాయకత్వానికి, కీర్తికి, విశ్వాసానికి సహజ సంకేతంగా ఉండే సూర్యుడు మన సంకల్పశక్తిని, వ్యక్తిత్వాన్ని తెలియజేసే విధంగా గ్రహ సంచారం చేస్తూ ఉంటాడు. అక్టోబర్ 17వ తేదీన సూర్యుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి రాశి అయిన తులారాశిలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
ధనస్సు రాశి
తులారాశిలో సూర్య సంచారం ధనుస్సు రాశి జాతకులకు కలిసి వస్తుంది. సూర్యుడు పదకొండవ ఇంట్లో , లాభ గృహంలో సంచరిస్తాడు. ఈ సూర్య సంచారం తర్వాత ధనుస్సు రాశి వారి జాతకం చాలా బాగుంటుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. వర్తక, వ్యాపారాలు చేసే వారికి లాభం వస్తుంది. సూర్య సంచారం కారణంగా ధనస్సు రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. గతంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి.

మిధున రాశి
తులారాశిలో సూర్య సంచారం మిధున రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. సూర్యుడు మిధున రాశిని పాలించే గ్రహం. ఈ సమయం వీరికి లాభదాయకంగా ఉంటుంది. సూర్యుడు మిధున రాశిలో ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల విద్యా రంగంలో పనిచేసే వారికి గణనీయమైన మార్పులు ఉంటాయి. మీ కెరీర్లో మీకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది.
సింహరాశి
సింహ రాశి వారికి సూర్యుడు అధిపతి. అటువంటి సూర్యుడు తులా రాశిలో సంచారం చేస్తూ సింహ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తాడు సింహరాశిలో సూర్య సంచారం సింహ రాశి వారి సాహసోపేత కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిలటరీలో పనిచేసే వారు, పోలీసులు శుభవార్తలు వింటారు. ఈ సమయంలో సూర్యుడు మూడవ ఇంట్లో సంచరించడం వల్ల అన్ని విషయాలలోనూ విజయం సాధిస్తారు. కెరీర్ కు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications