హనుమాన్ జయంతి నాడు విశేష యోగాలు.. నక్కతోక తొక్కే రాశులివే!
త్వరలో హనుమాన్ జయంతి రాబోతుంది.ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి హనుమాన్ భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో హనుమాన్ జయంతి నాడు ఏర్పడే విశేషమైన యోగాల కారణంగా కొన్ని రాశుల వారు లాభ పడనున్నారు. హనుమాన్ జయంతి నాడు పంచగ్రాహి యోగంతో పాటు అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి.
హనుమాన్ జయంతి నాడు విశేష యోగాలు
ఈ శుభ యోగాలు ద్వాదశ రాశుల వారికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నాయి. వారికి ఆర్థిక లాభాలతో పాటు విజయాలు చేకూరే అవకాశం ఉంది.సంవత్సరం చైత్ర మాసం శుక్లపక్ష పూర్ణిమకు హనుమాన్ జయంతి వస్తుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి వచ్చింది. ఈ హనుమాన్ జయంతి విశేష యోగాలు ఏర్పడే మూడు రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుంది. లబ్ది పొందే రాశులు ఏమిటి ప్రస్తుతం తెలుసుకుందాం.

మీన రాశి
మీనరాశిలో పంచగ్రాహి యోగంతో పాటు బుధాదిత్య, శుక్రాదిత్య, లక్ష్మీనారాయణ, మాలవ్య రాజయోగాలు ఏర్పడుతున్న కారణంగా ఈ రాశి జాతకులు అన్ని విధాలుగా లబ్ధి పొందుతారు. మీన రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన అపారమైన విజయాలను సాధిస్తారు. వీరిపైన హనుమంతుని అనుగ్రహం కచ్చితంగా ఉంటుంది.
కుంభరాశి
కుంభరాశి వారికి హనుమాన్ జయంతి నాడు ఏర్పడే యోగాలు విశేషమైన ప్రయోజనాలను ఇస్తాయి. ఇది ఉద్యోగ పరంగా మీ గొప్ప విజయాలకు దారితీస్తుంది. కుంభ రాశి వారికి ధనలాభాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలు చేసేవారు ఎక్కువ లాభాలను పొందుతారు. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచించేవారు ఈ సమయంలో పెట్టుబడి పెడితే కలిసి వస్తుంది. శుభవార్తలు వింటారు. ఈ సమయంలో స్నేహితులతో లబ్ధి జరుగుతుంది.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు హనుమాన్ జయంతి నాడు ఏర్పడే యోగాల కారణంగా కలిసి వస్తుంది. వీరికి హనుమాన్ ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తుంది. ఎంతో కాలంగా పెండింగ్ గా ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగం కోసం చూసే వారికి ఉద్యోగాలు వస్తాయి. ఆర్థిక లాభాలు చేకూరుతాయి. డబ్బు ఆదా చేస్తారు. ఈ సమయంలో వీరిపైన హనుమాన్ ప్రత్యేక కటాక్షం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications