శ్రీరామ నవమికి స్వామి వారికి ఇష్టమైన పానకం వడపప్పు తయారు చేసే పద్దతి
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
రాములోరి పండగ వస్తుంది అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కమ్మని పానకం, వడపప్పు. ఈ కమనీయన పదార్ధాలు శ్రీ రాముడికి ఎంతో ఇష్టం. అందుకే తప్పక శ్రీరామ నవమి రోజు అందరూ పానకం, వడపప్పు నైవేద్యంగా స్వామి వారికి నివేధన చేసి భక్తులకు వితరణ గావిస్తారు. మరి అంతటి కమనీయమైన ఈ పదార్ధాలు ఎలా తయారు చేస్తారు. వీటికి కావలన పదార్ధములు ఏమిటో తెలుసుకుందాం.
* పానకం తయారు చేయుటకు :-
కావాల్సినవి
నీళ్లు - లీటర్
బెల్లం - 100 గ్రాములు
యాలుకలు - నాలుగు
మిరియాలు. - నాలుగు
తయారీ చేయు విధానం :-
ముందుగా యాలుకల పైన తొక్క తీసేసి గింజల్నిపౌడర్ చేసి పెట్టుకోవాలి. తరువాత మిరియాలని పౌడర్ చేసి ఇప్పుడు రెండిటిని నీళ్లల్లో కలిపి తరువాత బెల్లం కూడా మెత్తగా చేసుకుని నీళ్ళల్లో వేసి బాగా కలపాలి అంతే అతి సులువుగా పానకం సిద్దం అవుతుంది.

* వడపప్పు చేయు విధానం :-
కావలసినవి:
పెసరపప్పు - అర కప్పు
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూన్
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
కొబ్బరి తురుము -టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
తయారీ చేయు విధానం :-
పెసరపప్పును నాలుగు గంటలు నీళ్లలో నానబెట్టాలి. నీటిని వడకట్టేసి, పప్పు ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, ఉప్పు వేసి కలపాలి అంతే వడపప్పు సిద్దం అవుతుంది.
* చలిమిడి తయారీ చేయు విధానం :-
కావలసిన పదార్ధాలు :-
బియ్యం - 300 గ్రాములు ( గంటసేపు నీళ్లలో నానబెట్టి, ఆరాక, పిండి చేయాలి )
మంచి నెయ్యి - ఒక కప్పు
ఇలాచి పొడి - అర టీ స్పూన్
జీడిపప్పు - 20
ఎండుకొబ్బరి తురుము - అర కప్పు
బెల్లం తురుము - 150 గ్రాములు
గసగసాలు - రెండు స్పూన్లు
తయారీ చేయు విధానం :-
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి గసగసాలు వేసి వేయించి తీసి దానిలోనే నెయ్యి వేసి, వేడయ్యాక కొబ్బరి తరుగు, కట్ చేసిన జీడిపప్పు పలుకులు వేయించుకోవాలి. తరువాత మరో గిన్నెను స్టవ్ మీద పెట్టి నీళ్లు పోసి మరిగించాలి. అందులో బెల్లం వేసి, లేత పాకం పట్టాలి. ఇప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టి, బెల్లం పాకంలో బియ్యం పిండి, జీడిపప్పు, కొబ్బరి, ఇలాచి పొడి, గసగసాలు వేసి ముద్దలు లేకుండా బాగా కలిపి చివరిలో నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడి తగ్గాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications