ఈ రాశులవారికి డిసెంబర్ వరకు ఆకస్మిక ధనలాభం, సంపన్న యోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో క్రూరమైన గ్రహంగా భావించే రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తుంది. రాహువు నక్షత్ర సంచారం 12 రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్న సమయంలో అనేక రాశుల వారికి లబ్ధి జరుగుతుంది. ఎప్పుడూ తిరోగమన దిశలోనే సంచరించే రాహువు డిసెంబర్ 2వ తేదీ వరకు తిరోగమన స్థితిలో ఉత్తరాభాద్ర నక్షత్రం మూడవ పాదం లో ఉంటాడు.
ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహువు సంచారం
డిసెంబర్ 2024 సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాలకు ఉత్తరాభాద్ర నక్షత్రంలోని రెండవ పాదంలోకి రాహువు ప్రవేశిస్తాడు. శని దేవుడు పాలించే నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహువు సంచారం ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశులవారికి ఊహించని ధనలాభాలు కలుగుతాయి. రాహువు ఈ రాశులవారికి శుభాలనిస్తాడు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

కుంభరాశి
రాహువు నక్షత్ర సంచారం కుంభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉత్తరాభాద్ర మూడవ పాదంలో రాహువు సంచారం కారణంగా కుంభరాశి జాతకులు శని దేవుడి అనుగ్రహాన్ని కూడా పొందుతారు. ఈ సమయంలో వీరికి అన్ని రకాల భౌతిక ఆనందం కలుగుతుంది. మృతి వ్యాపారాలలో ఉన్న వారికి పురోగతి లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన కాలం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం వరిస్తుంది.
మకర రాశి
రాహువు నక్షత్ర సంచారం మకర రాశి జాతకులకు ఫలవంతంగా ఉంటుంది. మకర రాశి వారి ఆర్థిక జీవితంలో ధన లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఎక్కడైనా రాకుండా ఆగిపోయిన మొండి బాకీలు వసూలు అవుతాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. విదేశాలలో వ్యాపారాలు చేసే వారికి భారీ ధన లాభాలు వస్తాయి. వ్యాపారస్తులకు డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి విదేశాలకు వెళ్లాలనే కల నెరవేరుతుంది.
తులారాశి
రాహువు నక్షత్ర సంచారం తులారాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. తులా రాశి జాతకులు ఈ సమయంలో సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. తులా రాశి జాతకుల జీవితంలో ఉన్న సమస్యలు, కష్టాలు తొలగిపోతాయి. ఉద్యోగాలు చేసే వారికి పురోగతి లభిస్తుంది. ఉద్యోగస్తులు మునిపటి కంటే మెరుగ్గా పనిచేయగలుగుతారు. అప్పుల బాధ తీరుతుంది. ఏ పనులు అనుకున్న ఆ పనులు సమయానుకూలంగా పూర్తవుతాయి. తులారాశి జాతకులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications