రేపటినుండి వీరికి ఐశ్వర్యంతో పాటు రాజభోగాలను వరమిచ్చిన సూర్యుడు!
వేద జ్యోతిష్య శాస్త్రం ద్వాదశ రాశుల వారి జీవితాన్ని నిర్ధారిస్తుంది. గ్రహాలు వివిధ రాశుల లోకి సంచారం అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. గ్రహాల రారాజు అయిన సూర్యుడికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. రేపు సూర్యుడు అక్టోబర్ 17వ తేదీన తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తులా రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి సూర్యుడికి మధ్య శత్రుత్వం ఉంటుంది. అయినా శత్రు రాశిలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టం ఇస్తుంది. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి
గ్రహాల రారాజుగా భావించే సూర్యుడు తులా రాశిలో సంచారం కారణంగా మేష రాశి వారి జాతకం మారిపోతుంది. మేష రాశి వారికి ఇది అదృష్ట సమయం. మేషరాశి జాతకులు ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. మేషరాశి జాతకుల ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు.ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

వృషభ రాశి
తులారాశిలో సూర్య సంచారం కారణంగా వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అక్టోబర్ 17 నుంచి ఈ రాశి వారికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం.
కన్యారాశి
కన్యారాశి జాతకులకు ఈ సమయం శుభ ప్రదంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. కెరీర్ కి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి.
కుంభరాశి
తులా రాశిలో సూర్య సంచారం కుంభరాశి వారికి బాగా కలిసొస్తుంది. కుంభ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. జీవితంలో సానుకూల పరిణామాలు ఎదురవుతాయి. వ్యాపారులు లాభాలను పొందుతారు. చాలా కాలంగా ఉన్న సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా లాభపడతారు. జీవితంలో సానుకూలమైన పరిణామాలతో కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది.
తులారాశి
తులా రాశి వారికి సూర్యసంచారం అదృష్టాన్ని ఇస్తుంది. సూర్య సంచారం కారణంగా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. విద్యార్థులకు ఈ సమయంలో సానుకూలంగా ఉంటుంది..ఇంట్లో పెద్ద వారి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications