మకర సంక్రాంతి నుండి వీరే మహర్జాతకులు.. తిరుగులేదన్న సూర్యుడు!
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్య గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాల రాజుగా చెప్పే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి 30 రోజుల కాలంలో సంచారం చేస్తాడు. ప్రతినెల సూర్యుడు ఒక రాశిలోకి సంచరిస్తూ ఉంటాడు. సూర్యగ్రహ సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది.
మకర సంక్రాంతి నుండి అద్భుతమైన ఫలితాలు
సూర్యుడి కటాక్షం ఉంటే వివిధ రాశుల వారి జీవితాలలో సంతోషం, ఆరోగ్యం ఉంటుంది. జనవరి 14వ తేదీన సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తాడు. అప్పటి నుంచే మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది. అయితే మకర సంక్రాంతి సమయంలో సూర్యుడు కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలను ఇస్తున్నాడు. మకర సంక్రాంతి నుండి అద్భుతమైన ఫలితాలను పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
సూర్య సంచారం కారణంగా మకర సంక్రాంతి నుండి వృశ్చిక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా వీరికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఆర్థికంగా లాభాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు ఊహించని ధన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది.
సింహరాశి
సూర్య సంచారం కారణంగా మకర సంక్రాంతి నుండి సింహరాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. సూర్యుడు వీరి జాతకంలో ఐదవ స్థానంలో ఉండడం వల్ల మీరు ఏ పని చేపట్టిన తిరుగులేకుండా ముందుకు సాగుతుంది. సింహరాశికి సూర్యుడు అధిపతి కావడంతో మకర సంక్రాంతి నుండి సూర్యుడు ఈ రాశి వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తాడు. సింహరాశి జాతకులు శుభవార్తలు వింటారు. పెండింగ్లో ఉన్న కోర్టుకేసులు పరిష్కారం అవుతాయి.
మేషరాశి
మేషరాశిలో తొమ్మిదవ స్థానంలో సూర్యుడు సంచారం చేస్తున్నాడు. దీనివల్ల మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయపరంగా ఎటువంటి సమస్యలైనా ఈ సమయంలో తొలగిపోతాయి. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో ప్రశంసలు పొందుతారు. ఇది మేషరాశి వారికి శుభ సమయం.నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications