వృషభరాశిలోకి సూర్యుడి ప్రవేశం.. ఈ రాశులవారికి తిరుగులేదు
ప్రతి గ్రహం దాదాపు నెలకోసారి రాశి మారుస్తుంటుంది. ఆ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. కొందరికి సానుకూల ప్రభావం ఉంటే మరికొందరికి ప్రతికూల ప్రభావం ఉంటుంది. జ్యోతిష్యంలో సూర్యుడి సంచారానికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడాన్ని సంక్రాంతి అంటారు. ఆ రోజు స్నానానికి, దానానికి వెలకట్టలేని ప్రాముఖ్యత ఉంది. మే 15న సూర్యుడు మేష రాశినుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తుండటంతో కొన్ని రాశులవారికి కలిసి రానుంది. వారెవరనేది తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సమయం. ఉద్యోగులకు బాగా కలిసివస్తుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడటమే కాక విదేశాలకు వెళ్ళేందుకు ప్రణాళిక రచించుకుంటారు. కుటుంబ వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఈ సమయంలో పోటీపరీక్ష రాస్తే విజయం సాధిస్తారు.
వృషభ రాశి
ఈరాశి 1వ ఇంటిలోనే సూర్యుడు సంచరిస్తాడు. ఉద్యోగులు, వ్యాపారస్తులు తమ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. కెరీర్లో విజయం సాధించడంతోపాటు వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

కర్కాటక రాశి
ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులు కలిసి రావడంతోపాటు కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.
సింహ రాశి
ఈ రాశికి అధిపతి సూర్యుడు అవడంవల్ల వీరికి ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తాడు. జీవితంలో శుభ సమయం ప్రారంభమవుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. వ్యాపారస్తులు వారి వృత్తిలో విజయం సాధించడమే కాకుండా ఇంటా బయటా గౌరవాన్ని పొందుతారు.
కన్యా రాశి
ఈ రాశిలోని తొమ్మిదవ ఇంట్లో సూర్యుడు సంచరించబోతుండటాన్ని అదృష్టంగా భావిస్తారు. ఈ సమయంలో మీ మనస్సుకు అనుగుణంగా పని జరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో కూడా సంతోషం ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది.
మీన రాశి
వృషభ రాశిలో సూర్య సంచారం అంటే మీన రాశినుంచి మూడో స్థానంలో సంచరిస్తున్నట్లవుతుంది. దీనివల్ల మధ్యలో నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. వివాదాలు పరిష్కారమవడతోపాటు ఉద్యోగస్తులు శుభవార్తలను వింటారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.












Click it and Unblock the Notifications