శని దేవుడు పరిపాలించే రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులకు ఎలా ఉంటుందో తెలుసా?
సూర్యుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించాడు. దాదాపు 30 రోజులు అక్కడే ఉంటాడు. దీని ప్రభావం కొన్ని రాశులపై ప్రత్యేకంగా ఉండబోతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. సూర్యుడు ఎవరి జాతకంలో శుభస్థానంలో ఉంటాడో వారికి ఊహించని రీతిలో లాభాలు ఉంటాయి. జీవితకాలం అనుకూల ఫలితాలతోపాటు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అడ్డంకులన్నీ తొలగిపోవడంతోపాటు ప్రేమ జీవితంలో విజయం సాధిస్తారు. సూర్యుడి సంచారం ఏయే రాశులవారికి బాగా కలిసి రానుందో తెలుసుకుందాం.
మేష రాశి
ఉద్యోగస్తులకు వారి వారి కార్యాలయాల్లో పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కార్యాలయాల్లో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

వృషభ రాశి
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ఆసక్తి కలుగుతుంది. ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తిచేయడానికి ఇది అనువైన సమయం అయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాటిని పూర్తిచేయలేరు. వ్యాపారస్తులకు ఇది మంచి సమయం.
వృశ్చిక రాశి
ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థికంగా నష్టపోయినవారు సులభంగా డబ్బులను తిరిగి పొందుతారు. వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రయాణాలు కూడా ఆర్థికంగా లాభాలనిస్తాయి.
మీన రాశి
ఈ రాశివారికి మిశ్రమ లాభాలున్నాయి. లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేసే ప్రతి పనిలోను ఆటంకాలు ఏర్పడతాయి. అంతేకాదు.. అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పని పూర్తయిపోయిందనుకున్న తరుణంలో కూడా అది పూర్తికాకుండా నిలిచిపోయే అవకాశాలే అధికంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications