మేషరాశిలో సూర్య సంచారం.. ఈ రాశులవారికి ఆకస్మిక ధననష్టం
మేషరాశిలో సూర్య సంచారం కారణంగా కొన్ని రాశుల వారు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏప్రిల్ నెలలో 13వ తేదీన రాత్రి ఎనిమిది గంటల 51 నిమిషాలకు మేష రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు. అయితే సూర్య గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను కలిగిస్తే, కొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలను కలిగిస్తుంది. సూర్య సంచారం కారణంగా నష్టపోయే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వృషభ రాశి
మేషరాశిలో సూర్య సంచారం కారణంగా వృషభరాశి వారికి తీవ్రనష్టాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేసిన అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. మీరు కోరుకునే లక్ష్యాలను సాధించడంలో విఫలమవుతారు. వృషభ రాశి జాతకుల కెరీర్ కూడా సూర్య సంచారం కారణంగా అనుకూలంగా లేదు. ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఈ కాలంలో ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా ఒడిదుడుకుల మయంగా మారుతాయి.

కన్యారాశి
మేషరాశిలో సూర్య సంచారం కారణంగా కన్యా రాశి జాతకులకు ఇబ్బందులు ఎదురవుతాయి. కన్య రాశి వారి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగంలో పురోగతిని సాధించలేరు. ఈ సమయంలో మీ అంచనాలు ఒకటైతే జరిగేది మాత్రం వేరుగా ఉంటుంది. ఖర్చులు ఊహించని విధంగా పెరగడంతో ఆర్థికంగా ఇబ్బంది పడతారు. వివిధ అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో వేధించడంతో డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది
తులారాశి
మేషరాశిలో సూర్య సంచారం కారణంగా తులారాశి వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది. తులా రాశిలోని వ్యాపారస్తులు ఈ సమయంలో నిరాశను ఎదుర్కొంటారు. వీరు తమ వ్యాపార నిర్ణయాలలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం చేసే చోట కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇక ఆకస్మిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి
మేషరాశిలో సూర్య సంచారం కారణంగా మకర రాశి వారికి కూడా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఆర్ధిక పరంగా విపరీతమైన సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. కుటుంబానికి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. వివిధ రకాలుగా నష్టపోయే అవకాశం ఉంటుంది, ఆర్థిక విషయాలలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications