వృషభరాశిలో సూర్య సంచారం.. ఈ రాశులవారి ఆరోగ్యం క్షీణిస్తుంది, జాగ్రత్త!!

వృషభరాశిలో సూర్య సంచారం ప్రపంచవ్యాప్తంగానే కాక 12 రాశులవారి జీవితాలపైన కూడా ప్రభావం చూపిస్తుంది. వృషభ రాశిలో సూర్యసంచారం అన్ని రాశులవారి ఆరోగ్యంపైన కూడా ప్రభావం చూపిస్తుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. వృషభ రాశిలో సూర్యుడు ప్రవేశించడం వల్ల సూర్యుడు బలంగా ఉన్న రాశుల వారు ఆరోగ్యంగా ఉంటే, బలహీనంగా ఉన్న రాశుల వారు ఆరోగ్యంలో క్షీణతను చూడాల్సి వస్తుంది.

వృషభ రాశిలో సూర్య సంచారం.. అన్ని రాశుల ఆరోగ్యంపై ప్రభావం
నిన్న సాయంత్రం 5 గంటల 41 నిమిషాలకు వృషభ రాశిలో సూర్యుడు ప్రవేశించాడు. వేద జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాల కంటే శక్తివంతమైన సూర్యగ్రహం వృషభ రాశిలో ప్రవేశించిన తర్వాత అన్ని రాశుల వారి జాతకాలలోనూ మార్పులు సంభవించాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొన్ని రాశుల వారు క్షీణతను చూస్తున్నారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Sun Transit in Taurus these zodiac signs will face health problems be careful

మిధున రాశి
వృషభ రాశిలో సూర్య సంచారం సమయంలో మిధున రాశి వారి ఆరోగ్యం క్షీణిస్తుంది. మిధున రాశి జాతకుల రోగ నిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. మీరు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంది. గొంతు ఇన్ఫెక్షన్లు బాధించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని సలహా ఇవ్వబడింది.

ధనుస్సు రాశి
వృషభ రాశిలో సూర్య సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో అనుకున్న ఫలితాలు ఉండకపోవచ్చు. మీరు గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడే అవకాశాలు ఉన్నాయి.వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం పైన ఈ సమయంలో ధనుస్సు రాశి వారు దృష్టి పెట్టాలి.

కుంభరాశి
వృషభ రాశిలో సూర్య సంచారం కారణంగా కుంభ రాశి వారికి కూడా ఆరోగ్యపరంగా ప్రయోజనాలు చేకూరవు. ఈ సమయంలో కుంభ రాశి వారు ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. గొంతు ఇన్ఫెక్షన్ తో పాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలు వీరిని బాధించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇవ్వబడింది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+