ఫిబ్రవరిలో వీరికి డబ్బుల మూటలు.. పట్టిందల్లా బంగారం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా గ్రహాల రాజు అయిన సూర్యుడు ఫిబ్రవరి మాసంలో మూడు సార్లు తన గమనాన్ని మార్చుకుంటున్నారు. ఫిబ్రవరి 6వ తేదీన సూర్యుడు మొదట ధనిష్ట నక్షత్రం లోకి ప్రవేశిస్తాడు. ఆ తరువాత ఫిబ్రవరి 13వ తేదీన సూర్యుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు.
సూర్య సంచారంతో లబ్ది పొందే రాశులు
ఫిబ్రవరి 19వ తేదీన సూర్యుడు శతభిషా నక్షత్రం లోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి మాసంలో మూడు సార్లు సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. వారి జీవితాలలో స్వర్ణయుగం ప్రారంభమవుతుంది. సూర్య సంచారంతో లాభపడే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి జాతకులకు సూర్య సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఫిబ్రవరి మాసంలో మూడుసార్లు జరిగే సూర్య సంచారం కారణంగా మేష రాశి వారు ఉద్యోగాలలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి పురోగతి లభిస్తుంది. ఈ సమయంలో పెట్టుబడులు మీకు ప్రయోజనాలను ఇస్తాయి. మేషరాశి వారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
సింహరాశి
సూర్యుడి సంచారం సింహరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో సింహ రాశి జాతకులు కీర్తి ప్రతిష్టలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వ్యాపారవేత్తలు భాగస్వామ్య వ్యాపారాల నుండి, ప్రధాన ఒప్పందాల నుండి ప్రయోజనాలను పొందుతారు. మరియు ఆస్తుల విషయంలో సింహరాశి వారికి సానుకూలతలు ఉంటాయి. ఈ సమయంలో సింహ రాశి వారు వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు.
ధనస్సు రాశి
ఫిబ్రవరి నెలలో సూర్యుడు మూడుసార్లు సంచారంలో మార్పు ధనుస్సు రాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి లభిస్తుంది. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రణాళికలు విజయవంతమవుతాయి. కొత్త ఆదాయ వనరులు ఉద్భవిస్తాయి.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications