మీనరాశిలో సూర్యసంచారం.. నెలరోజులు వీరిదే మహారాజయోగం!
ప్రతి నెలలో సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు. సంవత్సరంలో సూర్యుడు మొత్తం 12 రాశులను చుట్టేస్తాడు. సూర్య గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా విశిష్టమైన స్థానం ఉంది. సూర్యుడిని సమాజంలో కీర్తి ప్రతిష్టలకు, శ్రేయస్సుకు సూచికగా భావిస్తారు. సూర్యుడు రాశి మారినప్పుడల్లా అన్ని రాశుల వారి పైన ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.
సూర్య సంచారం
కొన్ని రాశులకి సూర్య సంచారం శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలను ఇస్తుంది. మార్చి 15వ తేదీన సూర్యుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. మీనరాశిలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
సూర్యసంచారం మిధున రాశి వారికి విశేషమైన ప్రయోజనాలను ఇస్తుంది. మిధున రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక తీరుతుంది. వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో ఆలోచించి పెట్టుబడులు పెడితే అద్భుతమైన ధన లాభాలు పొందుతారు. ఇది మిధునరాశి వారికి శుభ సమయం.
మీనరాశి
సూర్యసంచారం మీన రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సూర్య సంచారంతో మీన రాశి వారి ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా శుభవార్తలను కూడా వింటారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబంలో మళ్లీ పూర్వ వైభవం వస్తుంది . ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కలిసివస్తుంది. కష్టపడి పనిచేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.
ధనుస్సు రాశి
సూర్య సంచారం ధనుస్సు రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సూర్య సంచారంతో వీరు ఆకస్మిక ధన లాభాలను పొందటమే కాకుండా నూతన గృహాలు, వాహనాలను కొనుగోలు చేస్తారు. పూర్వీకుల నుండి ఆస్తులు వస్తాయి. సూర్య సంచారం వల్ల వీరి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. ఇది విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షలు రాసేవారు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications