జులై 16నుండి ఈ రాశులవారి జీవితాలను అల్లకల్లోలం చేయనున్న సూర్యుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాజు అయిన సూర్య సంచారం అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. జూలై 16వ తేదీన సూర్యుడు సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు కర్కాటక రాశిలోకి సంచరిస్తాడు.
కర్కాటక రాశిలో సూర్య సంచారం
కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. సూర్యుడు మరియు చంద్రుడు మధ్య స్నేహపూర్వక సంబంధం ఉండడం వల్ల కొన్ని రాశులకు ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఇదే సమయంలో కొన్ని రాశుల వారి జీవితాలలో గ్రహాల స్థితి కారణంగా మరికొందరు నష్టాలను చూసే అవకాశం కూడా ఉంది. ఆ రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
కర్కాటక రాశిలో సూర్య సంచారం కారణంగా మేష రాశి జాతకులకు నష్టాలు వస్తాయి. ఈ సమయంలో వీరిపై ఒత్తిడి పెరుగుతుంది. ఆస్తి సంబంధమైన విషయాలలో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఏ పని చేసిన జాగ్రత్తతో వ్యవహరించాలి. విజయవంతంగా పనులు నిర్వహించాలంటే మేషరాశి జాతకులకు అందుకు తగిన సహనం ఉండాలి. ఈ సమయం కాస్త కష్టంగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి
కర్కాటక రాశిలో సూర్య సంచారం కారణంగా వృశ్చిక రాశి జాతకులు ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు . పనిలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. తోబుట్టువులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో వివిధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కూడా ప్రతికూలతలు ఉంటాయి. కనుక కర్కాటక రాశి జాతకులు ఏ పని చేసిన జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి సూర్య సంచారం కారణంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ధనస్సు రాశి వారు ఏ పని చేసిన ఆచితూచి వ్యవహరించాలి. ఇది ధనుస్సు రాశి వారికి హానికరమైన కాలంగా చెప్పవచ్చు. ఆరోగ్యం పైన తప్పనిసరిగా శ్రద్ధ వహించాలి. అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త. పనిచేసే చోట జాగ్రత్తగా లేకుంటే అన్ని అవసరమైన వివాదాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఘర్షణలకు అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications