సర్వ పితృ అమావాస్య నాడు మూడు రాశులవారికి సూపర్ లక్!!
సర్వ పితృ అమావాస్య.. పితృపక్షం యొక్క చివరి రోజు అయినా అక్టోబర్ 14వ తేదీన వస్తుంది. ఈ అమావాస్యని మహాలయ అమావాస్య, పితృ పక్ష అమావాస్య, పెత్ర అమావాస్య, పెద్దల అమావాస్య అని రకరకాల పేర్లతో పిలుస్తారు. సంవత్సరంలోని భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నుంచి అశ్విని మాసం వరకు ఉండే అమావాస్యని పితృపక్షం అంటారు.
సర్వ పితృ అమావాస్య నాడే సూర్యగ్రహణం : ఈ సమయంలో సనాతన ధర్మాన్ని పాటించే చాలామంది తమను వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు పూర్వీకులను తలుచుకొని పితృ పక్షంలో వారికి పూజలు చేస్తారు. దీనివల్ల పితృదేవతల అనుగ్రహం కలిగి పితృదోష విముక్తి జరుగుతుంది. ఇక పితృపక్షం చివరిరోజైన సర్వ పితృ అమావాస్య నాడే సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. అయితే ఈ సూర్యగ్రహణం రాత్రిపూట ఏర్పడడంతో దాని ప్రభావం భారతదేశంలో కనిపించదు.

మిధున రాశి : ఇదిలా ఉంటే సర్వ పితృ అమావాస్య మూడు రాశుల వారికి శుభాలను చేకూరుస్తుంది. మిధున రాశి వారికి సర్వ పితృ అమావాస్య నాడు సూర్యుని యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ సందర్భంలో మిథున రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విశ్వాసం పెరుగుతుంది.
అన్నీ విజయావకాశాలే : వారు విజయ అవకాశాలను అందుకుంటారు. పూర్వీకుల అనుగ్రహం వల్ల ఉద్యోగం చేసే వారికి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఉద్యోగంలో మీ పని ఉన్నతాధికారులతో ప్రశంసించ బడుతుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మిధున రాశి వారు విజయం సాధిస్తారు.
సింహరాశి : సర్వ పితృ అమావాస్య నాడు సింహ రాశి వారికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. జాతకులు ఈరోజు ధన లాభాలను పొందుతారు. వారి జీవితంలో సంతోషం మరియు శ్రేయస్సు వెల్లివిరుస్తాయి. ఈ సమయంలో వారు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితం ఐశ్వర్యం మరియు ఆనందంతో నిండి ఉంటుంది. మీ సంబంధాలు మరింత బలపడతాయి. వ్యాపారంలో పురోభివృద్ధి ఉంటుంది. పెట్టిన పెట్టుబడులు అధిక లాభాలను ఆర్జించే సమయం ఇది.
తులారాశి : ఇక తులా రాశి వారికి సర్వ పితృ అమావాస్య మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది. వీరిపై పూర్వీకుల మరియు ముఖ్య గ్రహాల అనుగ్రహం ఉంటుంది.జీవితంలోని అన్ని రంగాలలోనూ వీరు విజయం సాధిస్తారు. సంపద, ఆరోగ్యం, భౌతిక సుఖాలు, ఆనందం ఈ సమయంలో కనిపిస్తాయి. ఉద్యోగం చేసేవారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం. తులా రాశికి చెందిన వ్యాపారులు ప్రత్యేక ప్రయోజనాలను సాధిస్తారు. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి.
-
జూన్ లో బృహస్పతి దయతో నక్కతోక తొక్కే రాశులు ఇవే! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
వాస్తు ప్రకారం ఇంట్లో చపాతీలను లెక్కపెట్టి చేస్తే పరమ దరిద్రం -
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
ఐదు దశాబ్దాల అంతరిక్ష స్వప్నం! ఒకే భూమి.. రెండు భిన్న దృశ్యాలు! -
మనిషి కళ్లతో చూసిన అత్యంత అరుదైన భూమి దృశ్యం! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది!












Click it and Unblock the Notifications