బుధాదిత్య రాజయోగంతో నెలరోజులపాటు ఈ రాశులవారికి తిరుగులేదు
సూర్యుడు, బుధుడి కలయికవల్ల వృషభరాశిలో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. ఈ యోగం అన్ని రాశులవారికి ప్రయోజనాన్ని కల్పించబోతోంది. ఈనెల 15న సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. జూన్ 7వ తేదీన బుధుడు రాబోతున్నాడు. అదేరోజు సూర్యుడు, బుధుడు కలవబోతున్నారు. దీనివల్ల ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి
ఈ రాశివారికి అదృష్టం కలిసివస్తుంది. బుధాదిత్య యోగం వృషభరాశివారికి మొదటి స్థానంలో ఏర్పడుతుండటంవల్ల ఏ పని తలపెట్టినా ప్రయోజనాన్ని పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్నవారు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక విషయాలపై అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

సింహ రాశి
వీరికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలుంటాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఫలితం కనిపిస్తుంది. రాజకీయాలతో సంబంధం ఉన్నవారు కూడా మంచి ప్రయోజనాలను అందుకుంటారు. భవిష్యత్తులో వచ్చే సమస్యలు తీరతాయి. అయితే తగినంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలు చేస్తున్నవారు తమ కొలిగ్స్ నుంచి శుభవార్తలను వింటారు.

కర్కాటక రాశి
బుధాదిత్య రాజయోగం ప్రభావం ఈ రాశివారిపై తీవ్రంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారికి భారీ లాభాలుంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విహార యాత్రలకు వెళతారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications