సూర్య సంచారంతో నేటినుండి జులై 15వరకు నెలరోజులు వీరికి డబ్బే డబ్బు.. మీరున్నారా!!
గ్రహాలకు రాజు అయిన సూర్య భగవానుడు ప్రతినెలా ఒక రాశి నుంచి మరొక రాశి లోనికి ప్రవేశిస్తాడు అన్న విషయం అందరికీ తెలిసినదే. ఈ విధంగా సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశి లోకి ప్రయాణం చేసి మొత్తం ద్వాదశ రాశులను పూర్తి చేయడానికి సంవత్సర కాలం పడుతుంది.
మిధునరాశిలో సూర్య సంచారం
ఇక నేడు సూర్యుడు మిధున రాశిలోకి ప్రవేశించాడు. ఈరోజు ఉదయం 4:47 నిమిషాలకు మిధున రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూలై 15వ తేదీ వరకు మిధున రాశి లోనే ఉంటాడు. మిధున రాశిలో సూర్య సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. నేటినుండి నెలరోజులపాటు ఈ రాశులవారి దశ తిరుగుతుంది.

మేష రాశి
సూర్య సంచారం కారణంగా మేష రాశి వారికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. కొత్త పనులను ప్రారంభించడానికి ఇది శుభ సమయం. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. ఉపాధి కోసం ఎదురుచూసే వారికి శుభవార్తలు అందుతాయి. ఈ సమయంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టినా లాభదాయకంగా ఉంటాయి. ఊహించని ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
సింహరాశి
సూర్య సంచారం కారణంగా సింహ రాశి వారికి లబ్ది జరుగుతుంది. ఈ సమయంలో వీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు రెడీ అవుతున్న వారు ఉద్యోగాలను సంపాదించే అవకాశం ఉంది. డబ్బుకు లోటుండదు. గృహ మరియు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కెరీర్, ఆరోగ్యం అన్ని అనుకూలంగా ఉంటాయి.
కన్యారాశి
కన్యా రాశి వారికి ఈ సమయం సూర్యసంచారం కారణంగా కలిసి వస్తుంది. వీరు ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి పురోగతి ఉంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువ విజయాలను సాధించడానికి అవకాశం ఉంటుంది.
తులారాశి
సూర్య సంచారం కారణంగా తులా రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. ఈ సమయంలో తులా రాశి వారు శుభవార్తలు వింటారు. మంచి ఉద్యోగ ఆఫర్లను పొందుతారు. ఉద్యోగం చేసే వారికి కెరీర్లో పురోగతి ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతంగా ఉంటారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి సూర్య సంచారం శుభవార్తలను అందిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లను ఇంక్రిమెంట్లను పొందుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. పనిచేసే చోట ఉన్నతాధికారుల యొక్క మద్దతు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోయి ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ఈ సమయంలో మనసులో ఏది అనుకున్న కచ్చితంగా నెరవేరుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications