surya gochar.. గ్రహాలరారాజు సూర్యుడి దయతో సంపన్నులవుతున్న రాశులు
గ్రహాలకు అధిపతి సూర్యుడు. ప్రస్తుతం సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు. అయితే మే 14వ తేదీన సూర్యుడు వృషభ రాశిలోకి రవాణా అవుతున్నాడు.సూర్యుడు నెలకు ఒకసారి తన రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ఈ నెలలో సూర్యుడు అక్షయ తృతీయ జరిగిన మూడు రోజుల తర్వాత మేష రాశి నుండి వృషభ రాశి వారికి ప్రవేశిస్తున్నాడు. అయితే సూర్యగోచారం వల్ల ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు కలిగే రాశులేమిటో చూద్దాం.
మేషరాశి
సూర్య గోచారం కారణంగా మేష రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. మేషరాశి వారికి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. మీరు చేసిన పనికి తగిన ఫలితం ఉంటుంది. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. కోర్టు కేసులలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతుతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

వృషభ రాశి
సూర్య సంచారం కారణంగా వృషభ రాశి వారికి లబ్ధి చేకూరుతుంది. వీరి వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది. గృహ లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరు ఆర్థిక లాభాలను పొందుతారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని పనులలోను విజయం సాధిస్తారు.
మిధున రాశి
సూర్య గోచారం కారణంగా మిధున రాశి వారి జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఈ సమయంలో పూర్తిగా లభిస్తుంది. మిధున రాశి వారి వైవాహిక జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఇది మీరు ఆనందంగా గడపడానికి సరైన సమయం.
సింహరాశి
సింహరాశి జాతకులకు సూర్య గోచారం కలిసొస్తుంది. ఈ సమయంలో వీరు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. కొత్త అవకాశాలు రావటంతో పాటు ప్రమోషన్లు కూడా పొందే అవకాశం ఉంది. మీరు చేసే పనికి ప్రశంసలు దక్కుతాయి. సింహ రాశి వారికి ఈ సమయం చాలా శుభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయి. పనిచేసే చోట మీ ఇబ్బందులన్నీ దూరమవుతాయి.
కన్యారాశి
కన్యా రాశి వారికి సూర్య గోచారం మెరుగైన ఫలితాలను ఇస్తుంది. సూర్యుని దయ కారణంగా కన్యారాశి జాతకులకు ఈ సమయంలో అన్నీ లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక లాభాలు చేకూరుతాయి. చదువుకునే విద్యార్థులు శుభవార్త లను వింటారు. జీవితం సంతోషదాయకం గా ఉంటుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు, ఉద్యోగ వ్యాపారాలలో లాభదాయకంగా ఉంటుంది.
కుంభరాశి
సూర్య గోచారం కారణంగా కుంభరాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. కుంభ రాశి జాతకులకు ఈ సమయంలో వ్యాపారంలో వచ్చిన సమస్యలు తొలగిపోయి, లాభాలు వస్తాయి. ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు. కుంభ రాశి జాతకులకు ఈ సమయం ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. చదువుకునే విద్యార్థులకు ఇది మంచి సమయం. ఇబ్బందులు అన్నిటిని సులభంగా అధిగమించి ముందుకు సాగుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!! -
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications