18ఏళ్ళ తర్వాత అద్భుత యోగంతో వీరికి సంపదలను తెస్తున్న సూర్య శుక్ర కేతువులు
సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల కలయిక అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా 18 సంవత్సరాల తర్వాత సూర్యుడు, కేతువు, శుక్రుడు కన్యారాశిలో సంయోగం చెందబోతున్నారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. మూడు గ్రహాలు కలయికతో ఏర్పడే త్రిగ్రాహి యోగం కొన్ని రాశుల వారి అదృష్టాన్ని మెరిసేలా చేస్తుంది.
త్రిగ్రాహి యోగం.. అదృష్ట రాశులు
సెప్టెంబర్ 16వ తేదీన సూర్యభగవానుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక శుక్రుడు కేతువు అప్పటికే కన్యారాశిలో సంచరిస్తున్న కారణంగా ఈ మూడు గ్రహాల సంయోగం జరగబోతుంది. సుమారు 18 సంవత్సరాల తర్వాత ఈ మూడు గ్రహాల అరుదైన సంయోగం జరుగుతుంది. ఈ అరుదైన త్రిగ్రాహి యోగం కారణంగా లబ్ది పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి
సూర్యుడు, శుక్రుడు, కేతువు మూడు గ్రహాల కలయిక మేష రాశి వారికి లబ్ధిని చేకూరుస్తుంది. మేషరాశి జాతకులు ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పెరుగుతుంది. వీరి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మిధున రాశి
త్రిగ్రాహి యోగం కారణంగా మిధున రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. మిధున రాశి జాతకుల ఇళ్లల్లో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. వీరిలో ఈ సమయంలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. తల్లి నుండి లేదా పూర్వీకుల నుండి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది.
సింహరాశి
సింహరాశి జాతకులకు త్రిగ్రాహి యోగం కారణంగా అదృష్టం ప్రకాశిస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. విద్యారంగంలో పనిచేసే వారికి లాభాలు ఉంటాయి. భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంట్లో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు చేసే వారికి పురోగతి కనిపిస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు త్రిగ్రాహియోగం అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా మంచి ఫలితాలను పొందుతారు. అధికారుల నుండి మద్దతు పొందుతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయం అన్ని విషయాలలోనూ ప్రయోజనకరంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications