అద్దె ఇంటికి వాస్తు చూడాలా? వద్దా?
అద్దె ఇంటికి వాస్తు చూడాల్సిన అవసరం లేదనే ఆలోచనలో కొందరుంటారు. కానీ ఇది ఎంతమాత్రం సరైన ఆలోచన కాదంటున్నారు వాస్తు పండితులు. అద్దెకు ఉండే ఇంటి వాస్తు సరిగా ఉన్నప్పుడే జీవితంలో ఎదుగుదల ఉంటుంది. మనకు సొంత ఇంటి కల నెరవేరాలంటే అద్దె ఇల్లు వాస్తు కూడా బాగుండాలి. సిటీలో అయినా, సిటీ మధ్యలో అయినా, సిటీ చివర అయినా, పల్లెటూళ్లో అయినా.. ఎక్కడైనా సరే.. ఉండే ఇంటి వాస్తు సరిగా ఉంటే జీవితంలో ఎదుగుదల కూడా ఉంటుంది.
మరీ సూపర్ గా వాస్తు లేకపోయినా పర్వాలేదుకానీ కనీసం కొన్ని పాటించాల్సిన నియమాలుంటాయి. వాటిని మాత్రం విస్మరించకూడదు. అలా చేస్తే అద్దె ఇంటికే మీరు పరిమితమైపోతారని పండితులు హెచ్చరిస్తున్నారు.
అద్దె ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు జాగ్రత్తలు
* ఆగ్నేయంలో వంట గది ఉండాలి
* ఈశాన్యంలో ద్వారం, ఇంటి మధ్యన ఖాళీ ఉండటం ప్రధానం
* నైరుతిలో బాల్కనీ ఉండకూడదు
* ఇల్లు దిక్కులు క్రాస్ గా కాకుండా ఓ తీరుగా ఉండాలి
* నైరుతి, దక్షిణ, పశ్చిమం వైపు మాస్టర్ బెడ్‌రూమ్ ఉండాలి

* నైరుతి గదికి నైరుతిలో ద్వారం ఉండకూడదు
* ఇంటి ఆవరణలో నూతులు, గోతులు వాస్తుకు అనుగుణంగా ఉండాలి
* వీధిపోట్లు, రోడ్డునుంచి పల్లంగా ఉన్న ఇళ్లు మంచివికావు. కొన్ని వీధిపోట్లు కలిసొస్తాయి
* దక్షిణ, పశ్చిమాల్లో టాయ్ లెట్లు ఉండాలి
వాస్తుతో సంబంధం లేకుండా పట్టించుకోవాల్సిన విషయాలు
అద్దెకు దిగే ఇంట్లో అంతకు ముందు అద్దెకు ఎవరున్నారు? వారికి కలిసొచ్చిందా? నష్టపోయారా? ఏవైనా ఇబ్బందులు పడ్డారా? యాక్సిడెంట్లు జరిగాయా? అనారోగ్య సమస్యలున్నాయా? ఆత్మహత్యలు ఉన్నాయా? కుటుంబంలో కలహాలు జరిగాయా? తదితర వివరాలను తెలుసుకోవాలి. ప్రధానంగా ఆ పోర్షన్ ప్రతిసారి ఎందుకు ఖాళీ అవుతోందనే విషయాన్ని కూడా గమనించాలి. వాస్తు బాగుంటే ఇళ్లు ఖాళీ అవుతూ ఉండవు. అన్నివిధాలుగా వాస్తు బాగున్న ఇంట్లోకి వెళ్లాలనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications