వీరికి రెట్టింపు సంపదలను, రాజభోగాలను ప్రకటించిన శుక్రుడి డబుల్ రాజయోగాలు!

విలాసాలకు అధిపతి అయిన శుక్రుడికి వేద జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రముఖ స్థానం ఉంటుంది. ప్రస్తుతం శుక్రుడు తన సొంత రాశి అయిన తులా రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు తన సొంత రాశిలో సంచారం చేయటం కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం, మాలవ్య రాజయోగం ఏర్పడ్డాయి. శుక్ర సంచారంతో ఏర్పడిన రాజయోగాల కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది.

శుక్ర సంచారంతో అదృష్ట రాశులు
సెప్టెంబర్ 18న తులారాశిలో శుక్ర గ్రహ సంచారం జరిగింది. శుక్ర సంచారం సమయంలో ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. త్రికోణాన్ని పాలించే గ్రహం ఉచ్ఛస్థితిలో ఉండి మధ్యలో ఉన్నప్పుడు కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం తులారాశిలో శుక్ర సంచారం కారణంగా సానుకూల ఫలితాలను, రాజ భోగాలను పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

The double rajayogas of venus declared double wealth and royal life to these zodiac signs

తులా రాశి
తులారాశిలో లగ్న గృహంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఇది తులారాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో తులారాశి జాతకులు ఆర్ధికంగా లాభపడతారు. వీరికి అన్ని పనులలో విజయం వరిస్తుంది. కెరీర్ లో పురోగతికి కూడా నూతన మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు వస్తాయి. తులారాశి జాతకుల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పెళ్లి కానివారికి పెళ్ళిళ్ళు అవుతాయి. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అన్ని విధాలా ఈ సమయం తులారాశి వారికి సంతోషాల సమయం.

మకర రాశి
మకరరాశిలో వృత్తి, వ్యాపారాల గృహంలో శుక్ర సంచారం కొనసాగుతుంది. దీనివలన మకర రాశి జాతకులకు అదృష్టం కలిసొస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకుల ఆదాయం బాగా పెరుగుతుంది, ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ లు వస్తాయి. భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. మకరరాశి భార్యా భర్తలు మంచి సమన్వయముతో ముందుకు సాగుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి చాలా లాభం ఉంటుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి.

కుంభ రాశి
కుంభ రాశిలో శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ కాలం కుంభరాశి జాతకులకు శుభ సమయంగా ఉంటుంది. కుంభరాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ లు లభిస్తాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారవేత్తలు తమ వృత్తిలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఆదాయంలో బాగా వృద్ధి ఉంటుంది. రాజభోగాలతో కూడిన జీవితం గడుపుతారు. కెరీర్‌లో ఊహించని విజయాలు వరిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్నవారికైనా ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+