నవంబర్ 10నుండి వీరికి తిరుగేలేదన్న ద్వి ద్వాదశ యోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుజుడు మరియు శుక్రుడు కలసి ద్వి ద్వాదశ యోగాన్ని ఏర్పరుస్తారు. రాక్షస గురువైన శుక్రుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన రాశి చక్రాన్ని మార్చుకొని సంచారం చేస్తాడు. శుక్రుడు నవంబర్ 2వ తేదీన తులారాశిలోకి ప్రవేశించి మాలవ్య రాజయోగాన్ని సృష్టించాడు.
నవంబర్ మాసంలో ద్వి ద్వాదశ యోగం
నవంబర్ 10వ తేదీన ఉదయం 9:30 నిమిషాలకు ఒకదానికొకటి 30 డిగ్రీల వద్ద ఉంటారు. ఇది ద్వి ద్వాదశ యోగాన్ని సృష్టిస్తుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ద్వి ద్వాదశ యోగం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
కుజుడు మరియు శుక్రుడు కలయిక కారణంగా ద్వి ద్వాదశ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మేషరాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభాలను పొందుతారు. కోర్టుకేసులలో విజయం సాధిస్తారు. విదేశాలకు సంబంధించి ప్రయోజనాలు పొందుతారు. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితం ఉంటుంది. పనిచేసే చోట ప్రశంసలు దొరుకుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
ధనుస్సు రాశి
కుజుడు మరియు శుక్రుడు కలయిక కారణంగా ఏర్పడిన ద్వి ద్వాదశ యోగం ధనుస్సు రాశి జాతకులకు ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరి వ్యక్తిత్వాలు గణనీయంగా మెరుగుపడతాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రయోజనం వస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు గణనీయమైన లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. ఊహించని విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు ద్వి ద్వాదశ యోగం అన్ని విధాల శుభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి కోరికలు తీరుతాయి. ఎంతోకాలంగా పరిష్కారం కాని కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో పేరు ప్రతిష్టలను పొందుతారు. గణనీయమైన ఆర్థిక లాభాలను చూస్తారు. నూతన ఆదాయ వనరులు ఈ సమయంలో వీరికి కనిపిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!! -
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications