తొలి సూర్యగ్రహణంతో వీరు పట్టిందల్లా బంగారం.. చేతినిండా ధనం!
2026 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైనది. జ్యోతిష్యపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఖగోళ సంఘటనగా భావించబడుతోంది. 2026 ఫిబ్రవరి 17న కంకణ సూర్యగ్రహణం అనేది కేవలం ఖగోళ పరిణామం మాత్రమే కాకుండా, జ్యోతిష్యంలో ఇది శక్తివంతమైన మార్పులకు కూడా సూచికగా పరిగణించబడుతుంది. ఈ సూర్య గ్రహణం కొన్ని రాశుల దశను మార్చేస్తుంది.
సూర్య గ్రహణంతో ఈ రాశులవారికి లక్
సూర్యుడు ఆత్మ, అధికారం, నాయకత్వం, ఆరోగ్యం, ప్రతిష్టలకు కారకుడు. కాబట్టి సూర్యగ్రహణం జరిగినప్పుడు వ్యక్తుల జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దిశలో కీలకమైన మలుపులు రావచ్చు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ గ్రహణం అదృష్టదాయకంగా మారే అవకాశముంది.

మేష రాశి
మేషరాశి వారికి ఈ సూర్యగ్రహణం కొత్త ఆరంభాలకు దారితీస్తుంది. ఉద్యోగ మార్పులు, పదోన్నతులు లేదా కొత్త వ్యాపార ఆలోచనలు నిజం అయ్యే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా మెరుగుదల కనిపించడంతో పాటు, వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.
వృషభ రాశి
వృషభరాశి వారికి సూర్య గ్రహణం కారణంగా ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు, కుటుంబ విస్తరణ వంటి శుభసూచనలు కనిపిస్తాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
సింహ రాశి
సింహరాశి వారికి ఈ గ్రహణం ప్రత్యేక శక్తిని అందిస్తుంది. సమాజంలో గౌరవం, గుర్తింపు వీరికి పెరుగుతాయి. రాజకీయ, సామాజిక, వృత్తి రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు దక్కవచ్చు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఇది అనుకూల సమయం కావచ్చు. కుటుంబ సహకారం కూడా లభిస్తుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి సూర్య గ్రహణం కారణంగా విద్య, ఉన్నతాధ్యయనం, విదేశీ ప్రయాణాల విషయాల్లో శుభఫలితాలు కనిపిస్తాయి. కెరీర్‌లో పురోగతి సాధ్యమవుతుంది. దీర్ఘకాల ప్రణాళికలను అమలు చేయడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. సూర్య గ్రహణం కారణంగా ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుదల ఉంటుంది. ధనుస్సు రాశి జాతకులకు ఇది లక్కీ కాలం.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.












Click it and Unblock the Notifications