త్వరలో ఈ రాశులవారికి సినిమా కష్టాలు సిద్ధం చేస్తున్న షడష్టక యోగం!
నవగ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశి చక్రాలను మార్చుకుంటూ ఉంటాయి. నవగ్రహాల రాశి చక్రాల మార్పు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం కర్కాటక రాశిలో కుజ సంచారం కొనసాగుతుంది. కుజుడు కర్కాటక రాశిలో జూన్ 7వ తేదీ వరకు ప్రయాణం సాగిస్తాడు. ఇక 9 గ్రహాలలో కీడు గ్రహంగా, చెడు చేసే గ్రహంగా భావించే రాహువు మే 18వ తేదీన కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు
రాహు కుజుల షడష్టక యోగం
ఈ కారణంగా రాహువు మరియు కుజ గ్రహాల ఆకృతిని బట్టి షడష్టక యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మే 18 నుండి జూన్ 7వ తేదీ వరకు ఏర్పడుతుంది. రాహువు కుజుడు కారణంగా ఏర్పడిన ఈ షడష్టక యోగం కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. వీరు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

సింహరాశి
షడష్టక యోగం కారణంగా సింహ రాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. వీరి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. వివిధ రకాల చిరాకులు, అనేక సమస్యలకు ఇది కారణమవుతుంది. మనశ్శాంతి లోపిస్తుంది. ప్రశాంతంగా బ్రతకడానికి అవకాశం ఉండదు. అడుగడుగున అసహనం పెరిగిపోతుంది. ఈ సమయంలో సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి, అనవసరపు గొడవలలోకి పోకుండా జాగ్రత్త పడాలి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి షడష్టక యోగం ఇబ్బందులకు కారణమవుతుంది. ఈ అశుభ యోగం మీ పైన ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. సన్నిహితులతో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చిరాకులు, జీవిత భాగస్వామితో ఎడబాటు కలిగే అవకాశం ఉంది. కనుక ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన. ఈ సమయంలో ఏం చేసినా ఎదురొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త.
మీనరాశి
షడష్టక యోగం మీనరాశి జాతకులకు అశుభ యోగంగా చెప్పవచ్చు. ఈ సమయంలో వీరికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఎక్కడ పెట్టుబడులు పెట్టినా రకరకాల సమస్యలు వస్తాయి. మీనరాశి జాతకులు ఈ సమయంలో ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. మీనరాశి వారు ఏం చేసినా అలోచించి చెయ్యాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications