నవంబర్ లో వీరి కనుచూపు మేరంతా బంగారమే చేస్తానన్న సూర్యుడు

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తాయి. మొత్తం నవగ్రహాలు వివిధ రాశుల్లోకి సంచారం చేసే క్రమంలో ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. నవగ్రహాలలో ప్రతి గ్రహానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలలో గ్రహాలకు రాజు అయిన సూర్యుడు చాలా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.

వృశ్చిక రాశిలో సూర్య సంచారం
ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు. నవంబర్ మాసంలో సూర్యుడు నవంబర్ 16వ తేదీన వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. నవంబర్ 16వ తేదీన మధ్యాహ్నం 1.44 నిమిషాలకు వృశ్చికరాశిలోకి సూర్య సంచారం జరుగుతుంది. ఆపై వృశ్చికరాశిలో సూర్యుడు డిసెంబర్ 15వ తేదీ వరకు ఉంటాడు. వృశ్చికరాశికి కుజుడు అధిపతి. కుజుడు రాశిలోకి సూర్యసంచారం కారణంగా కొన్ని రాశుల వారికి లబ్ధి జరుగుతుంది.

The sun promises to turn everything they see into gold in November

మేషరాశి
నవంబర్ మాసంలో మేష రాశి జాతకులకు సూర్య సంచారం కారణంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారి ఆదాయం పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. ఈ సమయంలో మేషరాశి వారు శుభవార్తలు వింటారు. మనసు సంతోషంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి . పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.

వృశ్చిక రాశి
నవంబర్ మాసంలో సూర్య సంచారం కారణంగా వృశ్చిక రాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి ధైర్యం పెరుగుతుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. కార్యాలయంలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుంది. కెరీర్లో పురోగతి కనిపిస్తుంది. రాజకీయపరంగా లాభం ఉంటుంది. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది.

మకర రాశి
నవంబర్ మాసంలో సూర్య సంచారం కారణంగా మకర రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. వారి కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక లాభాలను పొందుతారు. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. మకర రాశి వారు పిల్లలు, బంధువులు, కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

కుంభరాశి
నవంబర్ మాసంలో సూర్య సంచారం కుంభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. కార్యాలయంలో కొత్త బాధ్యతలను నిర్వర్తించవలసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ఎప్పటినుంచో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+