త్వరలో వీరిని కోటీశ్వరులను చేసే దాకా అస్తమించనన్న సూర్యుడు!
గ్రహాలరాజు సూర్యుడు డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రాత్రి 10గంటల 19నిమిషాలకు ధనుస్సురాశిలోకి సంచారం చేస్తాడు. ధనుస్సురాశిలో సూర్య సంచారంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. 2025 జనవరి 14వ తేదీ వరకు సూర్యుడు ధనస్సు రాశి లోనే సంచారం చేస్తాడు. ఆ తరువాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే సూర్యుడు ధనుస్సు రాశిలో సంచారం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
సూర్య సంచారంతో త్వరలో ధనుర్మాసం ఆరంభం
వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్య గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సూర్యుడి గ్రహ సంచారం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుడు ఈ నెల 15వ తేదీన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ధనుస్సు రాశిలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది .

ధనుస్సు రాశిలో సూర్య సంచారం
డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటల 19 నిమిషాలకు ధనుస్సు రాశిలోకి సూర్య సంచారం జరుగుతుంది. 2025 జనవరి 14వ తేదీ వరకు అంటే సంక్రాంతి వరకు సూర్యుడు ధనుస్సురాశిలోనే సంచారం చేస్తాడు. ఆ తర్వాత సూర్యుడు మకర రాశిలోకి సంక్రమిస్తాడు. ఇక సూర్యుడు ధనుస్సు రాశి సంచారం లబ్ధిని చేకూర్చే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ధనస్సురాశిలో సూర్య సంచారం కర్కాటక రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకు వస్తుంది. కర్కాటక రాశి ఉద్యోగులకు ఇది సానుకూల సమయం. ఈ సమయంలో వీరి ఆరోగ్యం బాగుంటుంది. ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది శుభ సమయం.
సింహరాశి
సూర్యుడు ధనుస్సు రాశిలో సంచారం చేయడం వల్ల సింహ రాశి వారు సానుకూల ఫలితాలు పొందుతారు. సింహరాశి వారు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు. ఇప్పుడు ఏ పని చేసినా విజయాలే వరిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారికి ఆర్ధిక స్థిరత్వం వస్తుంది. ఇది అన్ని విధాలుగా ధనుస్సు రాశి వారికి అధృష్ట సమయం.
తులారాశి
సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం తులారాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో తులారాశి వారు ఏ పని చేసినా మంచి ఫలితం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. తులారాశి వారు ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు. ఇది ఉద్యోగులకు, వ్యాపారులకు శుభ కాలం.
ధనుస్సు రాశి
ధనుస్సురాశిలో సూర్య సంచారం ధనుస్సు రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు ఏ పని చేసినా శుభ ఫలితాలను అందుకుంటారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈ సమయం మంచి సమయం . ఈ సమయంలో మీ పని ప్రశంసించబడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.
కుంభరాశి
కుంభరాశి జాతకులు సూర్య సంచారం కారణంగా అదృష్ట జాతకులుగా మారుతున్నారు. కుంభ రాశి వారికి ఈ సమయం ఆర్ధికంగా కలిసి వస్తుంది. ఎంతో కాలంగా వసూలు కాని మొండి బాకీలు ఈ సమయంలో వసూలవుతాయి. సూర్యుని ఆశీర్వాదంతో ఆకస్మిక ప్రయోజనాలను పొందుతారు. వైవాహిక జీవితం సుఖంగా సాగుతుంది. ఇది కుంభరాశి వారికి మంచి సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications