ఈ నెల 29వ తేదీ లోగా ఈ రాశుల సంపద పెరుగుతుంది!
గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలు, తర్కం, లెక్కలు, వ్యాపారానికి కారకుడు. జాతకంలో శుభస్థానంలో ఉంటే వారి జీవితంలో కీలక మార్పులు చోటుచేసుకొని సంతోషంగా జీవిస్తారు. పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఈనెల 10వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తిరోగమనంలో సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల రచన, సాహిత్యం, కళలు, జర్నలిజం రంగాల్లో ఉన్నవారికి ఊహించనిరీతిలో కలిసిరాబోతోంది. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే వివరాలను తెలుసుకుందాం.
మిథున రాశి
ఉపాధ్యాయ రంగంలో ఉన్నవారికి బాగా కలిసిరానుంది. జర్నలిస్టులకు, మీడియా రంగాల్లో పనిచేసే వ్యక్తులకు ఊహించనిరీతిలో ప్రయోజనాలు దగ్గబోతున్నాయి. పదోన్నతులు రావడం, ఇతర కంపెనీల్లో అవకాశాలు, భారీగా వేతనాలవంటి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులందరికీ వారి పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. తోటి ఉద్యోగుల నుంచి కూడా సహకారం లభిస్తుంది. మొత్తంగా ఈ రాశివారికి చాలా బాగుంటుంది.

కన్యా రాశి
సాంకేతిక రంగంలో ఉన్నవారు వారి రంగంలో మంచి స్థాయికి చేరుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు. మీపై ఇతరులకు ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ప్రారంభమవుతాయి. పరిశోధనా రంగంలో ఉన్నవారికి అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధంచనున్నాయి.
మకర రాశి
కెరీర్ పరంగా వీరికి మంచి ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఉద్యోగస్థులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. అలాగే వారికి విశేషమైన ప్రయోజనాలను వారు కలిగిస్తారు. మీ మాటతీరు వల్ల అనేకమంది మీకు దగ్గరవుతారు. జీవితకాలం అలాగే మాట్లాడుతుండాలి. ఎవరినీ కించపరచకూడదు. ఏ పని సాధించాలన్నా అందుకు ఆత్మవిశ్వాసాన్ని కలిగివుంటారు. పనిని పూర్తిచేసే సామర్థ్యం ఈ రాశివారి సొంతం.












Click it and Unblock the Notifications