2025 జనవరి నుండి అరుదైన యోగంతో నక్కతోక తొక్కే రాశులివే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్య గ్రహాల సంచార ప్రభావం అన్ని రాశుల వారి మీద తప్పనిసరిగా పడుతుంది. జనవరి 21వ తేదీ 2025న ఉదయం ఏడు గంటల 53 నిమిషాలకు సూర్యుడు శని సంయోగం కారణంగా అర్థకేంద్ర యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ముఖ్యంగా మూడు రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.
సూర్య, శని కలయిక కారణంగా అరుదైన యోగం
గ్రహాలకు రాజు అయిన సూర్య భగవానుడు శక్తిని ఇచ్చే దేవుడు. అలాగే శని మన కర్మ ఫలితాన్ని ఇచ్చే దేవుడు. సూర్యుడు శని కలిసినప్పుడల్లా దాని ప్రభావం అన్ని రాశుల వారి జీవితాల మీద పడుతుంది. కొన్నిసార్లు వీరిద్దరి కలయిక వల్ల ఏర్పడే అరుదైన యోగాలు కొన్ని రాశుల వారికి ఊహించని అదృష్టాన్ని కలిగిస్తాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేష రాశి
శని సూర్యులు కలిసి అర్ధకేంద్ర యోగాన్ని ఏర్పరచడం కారణంగా మేష రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారికి ఉద్యోగ జీవితం సంతోషాన్నిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ పని పట్ల ఉన్నతాధికారుల నుండి హర్షం వ్యక్తం అవుతుంది. ప్రమోషన్ లలో పురోగతికి పూర్తిగా అవకాశం ఉంది. అర్థకేంద్ర యోగం ఏర్పడడం కారణంగా మేష రాశి వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
వృషభ రాశి
శని సూర్యులు కలిసి ఏర్పరిచే అర్థకేంద్ర యోగంతో వృషభరాశి జాతకులకు కలిసొస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలను పొందుతారు. చాలా ప్రయోజనాలు ఉంటాయి. విదేశాల్లో పని చేసేవారు అపారమైన విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
సింహరాశి
శని సూర్యుడు కలిసి ఏర్పరిచే అర్థకేంద్ర యోగం కారణంగా సింహరాశి జాతకులకు అన్ని విధాల కలిసొస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు కలుగుతాయి .కొత్త ఒప్పందాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి . ఎప్పటి నుండ వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications