మార్చి నెలలో మహా శివరాత్రి, హోలీతో పాటు ముఖ్యమైన హిందూ పండుగలివే!!
మార్చి నెల హిందూ క్యాలెండర్లో చాలా ముఖ్యమైన నెలగా పరిగణించబడుతుంది. 2024 సంవత్సరంలో మార్చి నెల కృష్ణ పక్షంలోని పంచమి తిధి నాడు స్వాతి నక్షత్రంలో ప్రారంభమై, మార్చి 31 2024లో మూల నక్షత్రం కృష్ణ పక్షం సప్తమి తిథి తో ముగుస్తుంది. మార్చి నెలలో వచ్చే వివిధ ముఖ్యమైన పండుగలు, వేడుకల వివరాల్లోకి వెళితే..
మార్చ్ 6వ తేదీన విజయ ఏకాదశి ఒక ప్రత్యేక పర్వదినంగా నిర్వహించబడుతుంది. లంకను జయించడానికి శ్రీరాముడు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వారని స్కంద పురాణం చెబుతుంది. విజయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం మరియు ఈ రోజున ఆచార పూజలు చేయడం ద్వారా శత్రువులపై పై చేయి సాధిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తారు. వ్యక్తిగతంగా ఉండే ఇబ్బందికర పరిస్థితులను కూడా సులభంగా అధిగమించగలరు .

మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పండుగను జరుపుకుంటాం. ఫాల్గుణ మాసంలో వచ్చే కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం. ఈరోజు శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని, లోకకళ్యాణం కోసం శివపార్వతులు వివాహం చేసుకున్నారని నమ్ముతారు. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరించి జాగరణ చేసి, శివయ్యకు ఇష్టమైన పూజాదికాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. ఇక మార్చి 8వ తేదీన ప్రదోష వ్రతం కూడా నిర్వహించబడుతుంది.
మార్చి 10వ తేదీన పాల్గుణ అమావాస్యను జరుపుకుంటారు. ఈరోజు గంగా మరియు ఇతర పవిత్ర నదుల్లో స్నానం చేయడం చాలా ముఖ్యం. ఈ రోజున తర్పణాలు ఇవ్వడం, దానధర్మాలు చేయడం మంచిదని చెబుతారు. ఉపవాస దీక్షను ఆచరించాలి అనుకునే వారికి ఈరోజు మంచి రోజు అని, అలా చేయడం వల్ల జీవితంలో వారి అదృష్ట స్థాయి పెరుగుతుందని చెబుతారు.
మార్చి 20వ తేదీన అమలకి ఏకాదశి నిర్వహిస్తారు. అమలకి ఏకాదశి రోజున ప్రజలు ఉసిరి చెట్లను పూజిస్తారు. ఆ చెట్లు దేవతలకు నిలయమని నమ్ముతారు. ఉసిరి చెట్టును పూజించి, ఈ వ్రతాన్ని ఆచరించిన భక్తులకు మోక్షం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
మార్చి 24వ తేదీన హోలీ పండుగలో భాగంగా పాల్గుణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున హోళికా దహనం ఆచరిస్తారు. ఆరోజు హోళికా దహనాన్ని నిర్వహించి, ప్రజలందరూ సంతోషంగా రంగుల వేడుకకు శ్రీకారం చుడతారు. మార్చి 25వ తేదీన రంగుల పండుగ హోలీ ని ఘనంగా జరుపుకుంటారు. వసంత ఋతువుకు స్వాగతం పలుకుతూ భారతదేశంతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలు రంగులను చల్లుకుంటూ హోలీ పండుగను చేసుకుంటారు.
మార్చి నెలలో ఫాల్గుణ పూర్ణిమ వ్రతాన్ని చేసుకుంటారు. ఫాల్గుణ పూర్ణిమ రోజు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, చంద్రుడిని పూజిస్తారు. సత్యనారాయణ స్వామి కథను చదువుతారు. ఈరోజు పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది. ఫాల్గుణ పూర్ణిమ ఉపవాసం అనారోగ్యాలను తొలగిస్తుందని నమ్ముతారు. మార్చి 28వ తేదీన గణేశుడికి అంకితం చేయబడిన సంకష్టహర చతుర్ధిని నిర్వహిస్తారు. ఈ రోజున వినాయకుడిని నిష్కపటమైన భక్తితో పూజించే మంచి ఫలితాలను పొందుతారు.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications