శని బుధుల కేంద్రయోగంతో పులిపంజా చీల్చి సంపన్నులయ్యేది వీరే!

వేద జ్యోతిష్య శాస్త్రంలో శని మరియు బుధుడు రెండు ప్రభావవంతమైన గ్రహాలుగా చెబుతారు. ఈ రెండు గ్రహాలు కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ రెండుగ్రహాలు ఏర్పరిచే కేంద్రయోగం కారణంగా కొన్ని రాశులవారికి సానుకూల ఫలితాలు వస్తున్నాయి. జూన్ 9వ తేదీన శని మరియు బుధుల కారణంగా ఏర్పడే కేంద్రయోగం జ్యోతిష్య శాస్త్రంలో ఒక దృగ్విషయం శని మరియు బుధుడు ఒకదానికొకటి 90డిగ్రీల కోణీయ సంబంధాన్ని ఏర్పరిచిన క్రమంలో కేంద్రయోగం ఏర్పడుతుంది.

శని, బుధుల కేంద్ర యోగం
బుధుడు తన సొంత రాశి అయిన మిధున రాశిలోను, శని మీన రాశిలోనూ ఉన్న సమయంలో కేంద్ర యోగం ఏర్పడుతుంది. ఈ కేంద్ర యోగం కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

These are the people who will become rich with the kendrayoga of Saturn and Mercury

మకర రాశి
మకర రాశి వారికి శని బుధుల కారణంగా ఏర్పడే కేంద్ర యోగం కారణంగా కలిసి వస్తుంది. దీని కారణంగా మకర రాశి వారు ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సమస్యలను అధిగమిస్తారు. కష్టపడి పనిచేసేవారికి విజయాలు వరిస్తాయి. వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి. పని పట్ల మీ నిబద్ధత పెరుగుతుంది.

కుంభరాశి
శని బుధులు ఏర్పరిచే కేంద్ర యోగం కారణంగా కుంభరాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు. దీర్ఘకాలిక వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. మీడియా, మార్కెటింగ్ మరియు విద్యా రంగాలలో మీకు మంచి గుర్తింపు వస్తుంది. సామాజికంగాను ఖ్యాతి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోకుండా ఉంటే మంచిది. ఈ సమయంలో కుంభరాశి జాతకులు కచ్చితంగా మంచి ఫలితాలను సాధిస్తారు.

మీన రాశి
శని బుధుల కారణంగా ఏర్పడే కేంద్ర యోగం కారణంగా మీన రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఆస్తులు కొనుగోలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇది వీరికి మంచి సమయం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కలిసొస్తుంది. కుటుంబ సభ్యులతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యులకు ఈ సమయంలో సహాయం చేయవచ్చు. వృత్తిపరంగా ఈ సమయంలో సహాయం చేయవచ్చు. మీన రాశి వారికి ఇది శుభ ఫలితాలను ఇచ్చే సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+