Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శని మహాదశతో పులిపంజా చీల్చుకుని కోటీశ్వరులు అయ్యే రాశులివే!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం వివిధ రాశులవారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశులు ఉన్నాయి . జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీ రాశి ఒక్కో గ్రహంతో పాలించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో శని భగవానుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. శని గ్రహం చాలా నిదానంగా కదిలే గ్రహం. శని గ్రహం రాశి సంచారం రెండు సంవత్సరాల పాటు జరుగుతుంది.

శని మహాదశ
ఎవరి జీవితంలో శని ఉచ్చస్థితిలో ఉంటే వారు శని మహాదశ చూస్తారు.వారికి శనీశ్వరుడు అద్భుతమైన ప్రయోజనాలను అందించి వారిని అన్ని విషయాలలో రాణించేలా చేస్తాడు. ఇక శని మహాదశ ఉన్న రాశుల వారు సుమారు 19 సంవత్సరాల పాటు శని దేవుడి దయ వల్ల అన్ని విధాలుగా ఉన్నత స్థితిని చూస్తారు. ప్రస్తుతం శని మహాదశలో ఉన్న రాశుల గురించి తెలుసుకుందాం.

These are the zodiac signs that will become millionaires with the shani Mahadasha

మకరం
శని గ్రహం పాలించే రాశి అయిన మకర రాశి వారికి శని మహాదశ కలిసి వస్తుంది. ఈ రాశివారు శని భగవానుడి ఆశీర్వాదంతో అన్ని విధాలా ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశికి చెందినవారు శని మహాదశ కారణంగా సానుకూల ఫలితాలను పొందుతారు .మకర రాశి వారు శని మహాదశ కారణంగా తమ పనిలో అభివృద్ధి చెందుతూ ఉంటారు. వీరి ప్రణాళికలు ఒక్కొక్కటి విజయవంతంగా పూర్తవుతాయి. చేసే పనులలో విజయం సాధిస్తారు.

కుంభం
శని గ్రహం పాలించే రాశి అయిన కుంభరాశి వారికి కూడా శని మహాదశ కలిసి వస్తుంది . ఈ రాశివారు శని దేవుడి దయతో సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఏం చేసినా కలిసివస్తుంది. ఆర్ధికంగా కుంభరాశి వారికి కలిసి వస్తుంది. కుంభరాశి వారి కష్టాలు ఈ దశలో పరిష్కారమై అన్ని విధాలా వీరికి పురోగతి కలుగుతుంది. శని మహాదశ వలన వీరు సంతోషంగా జీవిస్తారు.

కన్య
కన్యా రాశి వారికి శని మహాదశ కారణంగా లబ్ది జరుగుతుంది. కన్యా రాశి వారికి శని అధిపతి కాకపోయినా ఈ రాశి వారికి శని కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. కన్యా రాశి జాతకులు వ్యాపారాలలో రాణిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ దశలో మీరు అనవసర ఖర్చులు చేయకుండా పొదుపు చేస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+