సంక్రాంతి నుండి నక్కతోక తొక్కే రాశులవారు వీరే!
తెలుగువారు ఎంతో ఇష్టంగా జరుపుకునే మకర సంక్రాంతి పండుగ రానే వచ్చింది. మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశిలో ఉన్న సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడంతో పాటు, పుష్య నక్షత్ర యుక్తంగా ఈసారి మకర సంక్రాంతి చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది.
మకర సంక్రాంతి నుండి అదృష్ట రాశులు
సూర్యుడు జనవరి 14వ తేదీ ఉదయం 8:44 కర్కాటక రాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి సంపదల వర్షాన్ని కురిపిస్తుంది. మకర సంక్రాంతి నుండి కొన్ని రాశులు నక్కతోక తొక్కబోతున్నారు. ముఖ్యంగా మూడు రాశులవారికి తిరుగే ఉండదు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
మకర సంక్రాంతి పండుగ నుండి మేష రాశి వారి అదృష్టం కలిసి వస్తుంది. మేషరాశి జాతకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారు జాక్పాట్ కొడతారు. నూతన ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి ఇది అనుకూల సమయం. నూతన ఆదాయ వనరులకు మార్గం తెరుచుకుంటుంది. .మేష రాశి జాతకులు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ఇది వీరికి సకల శుభాలను కలిగించే మంచి సమయం.
సింహరాశి
మకర సంక్రాంతి పండుగ నుంచి సింహరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. మకర సంక్రాంతి నాడు సూర్యసంచారంతో సింహ రాశి వారికి అన్ని విధాల శుభాలు జరుగుతాయి. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ మకర సంక్రాంతి శత్రువుల మీద విజయాలను ఇవ్వడంతో పాటు సింహ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.
మకర రాశి
మకర రాశి జాతకులకు మకర సంక్రాంతి పండుగ సానుకూల ఫలితాలకు వేదికగా మారుతుంది. మకర సంక్రాంతి నుండి మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కోర్టు సంబంధిత కేసులలో సానుకూల తీర్పులు వచ్చి, ఆస్తి లాభాలు కలుగుతాయి. చాలా కాలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. మకర రాశి వారికి వ్యక్తిగతంగా, వృత్తిపరంగానూ బాగా కలిసి వస్తుంది. సంక్రాంతి నుండి వీరి జాతకాలు మారబోతున్నాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications