కొత్త ఏడాదిలో కేతువు వల్ల సంపద పెంచుకుంటున్న రాశులు వీరే

నవగ్రహాల్లో కీలకమైన గ్రహం కేతువు. దీనికి ఛాయా గ్రహమని కూడా పేరు. నీడ గ్రహం అంటారు. రాహువుతోపాటు కేతువు కూడా ప్రతి రాశిలో 18 నెలలు సంచారం చేస్తుంటాయి. 2026 కొత్త సంవత్సరంలో కేతువు సంచారంతో మూడు రాశులకు అద్భుత ప్రయోజనాలు కలుగుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాదిలో సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి మారే కేతువు మోక్ష కారకుడు. ఆయన వల్ల ఆధ్యాత్మిక సంపద కూడా ఒనగూరుతుంది. గరిష్టంగా కేతువు వల్ల ప్రయోజనం పొందబోయే రాశుల వివరాలను తెలుసుకుందాం.

తులా రాశి
కెరీర్ పరంగా మార్పులు చోటుచేసుకుంటాయి. పనిలో మంచి వృద్ధిని నమోదు చేస్తారు. వివాహానికి సంబంధించి ఎప్పటిగానో ఎదురుచూస్తున్న శుభవార్తను కూడా అందుకుంటారు. అంతేకాదు.. సంపద పెరుగుతుంది. బ్యాంకులో నిల్వ ఉండే డబ్బు కూడా పెరుగుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు తలుపు తడతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

These are the zodiac signs that will increase their wealth in the new year due to Ketu

కుంభ రాశి
వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు చాలా తక్కువ సమయంలోనే అధిక లాభాలను ఆర్జిస్తారు. సంపద పెంచుకుంటారు. కొత్త స్నేహితులు దొరుకుతారు. జీవిత భాగస్వామి నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మిక జీవితంవైపు మొగ్గుచూపిస్తారు. ఉద్యోగాలు మారాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. మంచి అవకాశాలు కూడా వస్తాయి. ప్రయాణాలు చేస్తారు. వీటివల్ల వీరికి ధనలాభం ఉంది.

కర్కాటక రాశి
కెరీర్ పరంగా మంచి విజయాన్ని అందుకుంటారు. అంతేకాదు.. కెరీర్ లో ఎదురవుతున్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. వీరి ఆదాయం ఊహించనిరీతిలో పెరుగుతుంది. తోబుట్టువుల నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి మంచి ప్రయోజనాలు అందుకుంటారు. పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+