మౌని అమావాస్య రోజు ఈ దానాలు చేస్తే పితృదేవతల ఆశీర్వాదంతో ఆనందం, ఐశ్వర్యం!!
సనాతన ధర్మంలో మౌని అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మాఘమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ప్రతి నెలలో వచ్చే అమావాస్యతో పోలిస్తే మౌని అమావాస్యకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మౌని అమావాస్య రోజు నదీస్నానం చేసి, దానాలు చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుందని చెబుతారు. అసలు మౌని అమావాస్య రోజు ఎటువంటి దానధర్మాలు చేయాలి? దాని ఫలితం ఎలా ఉంటుంది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
2024 సంవత్సరంలో ఫిబ్రవరి 9వ తేదీన మౌని అమావాస్య వస్తుంది. మాఘమాసంలో మౌని అమావాస్య తిథి ఫిబ్రవరి 9వ తేదీన ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాలకు ప్రారంభమై, మరుసటి రోజు ఫిబ్రవరి 10వ తేదీన ఉదయం నాలుగు గంటల 20 నిమిషాలకు ముగుస్తుంది.

సనాతన ధర్మం ప్రకారం అమావాస్య రోజున ఉపవాసం చేయడం ద్వారా పూర్వీకులు మోక్షాన్ని పొందుతారు. ఎవరైతే అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలను పాటిస్తారో వారి జీవితంలో శుభ ఫలితాలు వస్తాయి. మౌని అమావాస్య సందర్భంగా పేదలకు అన్నదానం చేయడం ఉత్తమమైనదని, ఈరోజున శక్తి మేరకు పేదలకు అన్నదానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు.
మౌని అమావాస్య రోజున పేదలకు అవసరమైన వస్తువులను దానం చేయడం వల్ల కూడా మన పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. పాలు, పంచదార, ధాన్యాలు, వస్త్రాలు ఈరోజు దానం చేయడం మంచిదని సూచిస్తున్నారు. మౌని అమావాస్య రోజున ఉసిరికాయలను కూడా దానం చేస్తారు. ఇలా దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అని చెబుతున్నారు.
మౌని అమావాస్య రోజున స్నానం చేసిన తర్వాత ధాన్యాన్ని బ్రాహ్మణుడికి దానం చేస్తే పూర్వీకులకు ఆత్మ సంతృప్తి కలుగుతుందని చెబుతున్నారు. మౌని అమావాస్య నాడు ఆవనూనెను అవసరమైన వారికి దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని, వారి జీవితంలో ఆనందం లభిస్తుందని చెబుతున్నారు. దుప్పట్లు దానం చేయటం కూడా మౌని అమావాస్య నాడు పితృదేవతలకు శాంతిని చేకూరుస్తుంది.
-
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications