astrology: 19ఏళ్ళ తర్వాత అధిక శ్రావణం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్టే!!
ఈ సంవత్సరం శ్రావణమాసం 4వ తేదీన ప్రారంభమైంది. ఈసారి శ్రావణమాసం 58 రోజులపాటు కొనసాగనుంది. 19 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం అధిక శ్రావణ మాసం వచ్చింది. ఇది అరుదుగా యాదృచ్చికంగా జరిగేదే అయినప్పటికీ ఈ శ్రావణ మాసంలో వివిధ ప్రధాన గ్రహాల కలయిక వల్ల అన్ని రాశుల వారి జీవితాలలోనూ పెను మార్పులు సంభవించనున్నాయి.
5 రాశులకు శ్రావణంలో అదృష్టం : ముఖ్యంగా కొన్ని రాశులవారికి ఈ రెండు నెలల కాలం పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 5 రాశుల వారికి ఈ రెండు నెలల కాలం మామూలుగా కలిసిరాదు. వీరు అనుకున్న పనులన్నీ కచ్చితంగా పూర్తవుతాయి. మేష రాశి, మిధున రాశి, సింహ రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి జాతకులకు ఈ రెండు నెలలు అదృష్టాన్ని తీసుకొస్తాయి.

మేష రాశి : ఈ శ్రావణ మాసం మేష రాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. పరమ శివుని అనుగ్రహం తో వీరు అనుకున్న పనులన్నీ కచ్చితంగా నెరవేరుతాయి. వీరు ఏ పని చేపట్టినా విజయాలు వరిస్తాయి. ఆర్థికంగా బాగా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాల్లో పురోగతి తో పాటు, జీవితంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
మిధున రాశి : ఈ సమయంలో మిథునరాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. ఈ శ్రావణం వారికి ఆకస్మిక ధన లాభం ఇస్తుంది. ఎప్పటినుండో వసూలు కాని డబ్బు కూడా తిరిగి వస్తుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి.
సింహరాశి : ఇక సింహ రాశి జాతకులకు శ్రావణం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. వ్యాపారంలో బాగా లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను సంపాదించడంతో పాటు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. అన్ని విధాలుగా శ్రావణం సింహ రాశి జాతకులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది.
ధనుస్సు రాశి : శ్రావణమాసం ధనుస్సు రాశి వారికి చాలా లాభాలను కలిగిస్తుంది. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో కెరీర్లో ఎదుగుదల ఉంటుంది. అనుకున్న పనులను సాధిస్తారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. పోటీ పరీక్షలు రాసే వారికి ఉత్తమ సమయం గా చెప్పొచ్చు.
వృశ్చిక రాశి : శ్రావణమాసం వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి జాతకుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో కుటుంబ సంతోషం వెల్లివిరుస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications