కలలో కూడా ఊహించనిరీతిలో ఈ రాశులకు ధనయోగం
బుధుడు, శుక్రుడు, శనిదేవుడు తమ తమ సొంత రాశుల్లో ఉండటం చాలా అరుదు. బుధుడు కన్యారాశిలో, శుక్రుడు తులారాశిలో 15 రోజులు సంచారం చేయనున్నారు. అలాగే శని వచ్చే ఏడాది వరకు కుంభరాశిలో ఉంటాడు. దీనివల్ల మూడు నెలలపాటు కొన్ని రాశులవారి జీవితం అద్భుతంగా సాగిపోతుంది. తిరుగులేని విజయాలు సాధించడంతోపాటు ఓ వెలుగు వెలుగుతారు. జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. ఏ రాశులకు, ఏ విధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
వృషభం
జీవనశైలి మారుతుంది. ఆస్తులు పెరుగుతాయి. ఉద్యోగంతోపాటు వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఆర్థికంగా కలిసివస్తుంది. ఆదాయం రోజురోజుకు వృద్ధి చెందుతుంది. గురువు ఇదే రాశిలో సంచారం చేస్తుండటంవల్ల వీరు ఓ వెలుగు వెలుగుతారు. ఎక్కడ కాలుపెడితే అక్కడ కనక వర్షం కురుస్తుంది.

మిథునం
ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండి, కెరీర్ పరంగా అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తితో వివాహం కుదురుతుంది. విదేశీ అవకాశాలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు విజయం సాధిస్తారు. ఉద్యోగంతోపాటు వృత్తిలో ఉన్నవారు విదేశీ పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది.
కన్య
వీరి జీవితంలో కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై ఆ ఆస్తి కలిసివస్తుంది. కెరీర్ మాత్రం సాఫీగా సాగిపోతుంది. వారసత్వ సంపద కూడా లభించే అవకాశం ఉంది. కలలో కూడా ఊహించని ఉద్యోగంలో చేరతారు.
తుల
కుటుంబంలో శుభ పరిణామాలు జరుగుతాయి. ఆస్తులు కలిసివస్తాయి. అది కూడా తండ్రివైపు నుంచి. ఉద్యోగం లేనివారికి, పెళ్లికానివారికి విదేశీ ప్రయత్నాలు కలిసివస్తాయి. వృత్తి, వ్యాపారంలో వస్తున్న లాభాలు అంచనాలను మించుతాయి. వ్యాపారరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో పై స్థాయికి చేరుకుంటారు.
మకరం
వదులుకున్న డబ్బులు చేతికి అందుతాయి. ఉద్యోగంలో ప్రాముఖ్యత ఉన్న పోస్టు దక్కుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు. వ్యాపారాలు లాభాలబాటలో పయనిస్తాయి.
కుంభం
కష్టనష్టాలు తొలగిపోవడంతోపాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ, పెల్లి వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. అనారోగ్యం తగ్గిపోతుంది. నష్టాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు బాగుంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చోటుచేసుకుంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.












Click it and Unblock the Notifications