దీపావళికి ఈ రెండు గ్రహాలు కలిసి ఇస్తాయి సిరి సంపదలు!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అనేక శుభ యోగాలను, అనేక అశుభ యోగాలను కూడా ఏర్పరుస్తాయి. ఇక త్వరలో దీపావళి రాబోతున్న కారణంగా దీపావళి రోజు కొన్ని గ్రహాల సంయోగం, కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను ఇస్తుంది. దీపావళి రోజు బుధుడు, కుజుడితో సంయోగం చెందబోతున్నారు. ఈ రెండు గ్రహాల సంయోగం తులారాశిలో జరుగుతుంది. ఈ సంయోగం కారణంగా అదృష్టవంతులు అవుతున్న రాశుల గురించి తెలుసుకుందాం.

ధనస్సు రాశి
ధనుస్సురాశి వారికి కుజుడు, బుధుడు కలయిక సానుకూల ఫలితాలను ఇస్తుంది. ధనుస్సురాశి జాతకులు ఈ సమయంలో గణనీయమైన ఆదాయాన్ని పొందుతారు. వారసుడు వస్తాడు. పెట్టుబడుల నుంచి రాబడి వస్తుంది. కొత్త కెరీర్ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ధనస్సు రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ కాలంలో స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీల నుండి ప్రయోజనాలను పొందుతారు.

These two planets together will bring you wealth and prosperity on Diwali

కన్యారాశి
కన్యారాశి జాతకులకు కుజుడు, బుధుడు కలయిక అదృష్టాన్ని ఇస్తుంది. కన్యా రాశిలో సంపద గృహంలో ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది. దీనివల్ల కన్యారాశి వారు ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. కొత్త వ్యాపార అవకాశాలు కనిపిస్తాయి. ఎప్పటినుంచో నిలిచిపోయిన ప్రాజెక్టు ఊపందుకుంటుంది. దీర్ఘకాలంగా ఉన్న కుటుంబ వివాదాలు పరిష్కరించబడ్డాయి. సంబంధాలు స్నేహపూర్వకంగా మారుతాయి. కన్యా రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కుజుడు మరియు బుధుడి కలయిక శుభ ఫలితాలను ఇస్తుంది. కుజుడు బుధుల కలయిక కర్కాటక రాశిలో నాలుగవ ఇంట్లో జరుగుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు సౌకర్యాలను, విలాసాలను అనుభవిస్తారు. సామాజికంగా గౌరవాన్ని పొందుతారు. ఈ సమయంలో కర్కాటక రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పటినుంచో నిలిచిపోయిన ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లితో సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఇది వీరికి అన్ని విధాలా అదృష్ట సమయం.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+