ఈరోజు నుంచి వీరి జీవితం మలుపు తిరుగుతుంది
ధన త్రయోదశి శుక్రవారం వచ్చింది. అంతేకాకుండా చంద్రుడు కన్యారాశిలో సంచరించబోతున్నారు. కన్యారాశిలో శుక్రుడు, చంద్రుడు సంచరించడంవల్ల ఈ ఏడాది ధన త్రయోదశి కొన్ని రాశులవారికి శుభప్రదంగా మారుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. కొన్ని రాశులవారికి అన్నీ శుభవార్తలే వినపడతాయి. ఆర్థికంగా లాభాలున్నాయి. ధన త్రయోదశి వల్ల ఏయే రాశులకు బాగుంటుందో తెలుసుకుందాం.
మేష రాశి : ధన త్రయోదశి రోజు ఏర్పడే ప్రత్యేక యోగాలు ఈ రాశివారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. షాపింగ్ చేయడంవల్ల లాభాలున్నాయి. వ్యాపారస్తులు గతంలో పెట్టిన పెట్టబడుల నుంచి ఈ సమయంలో లాభాలు పొందుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థికంగా బలోపేతమవుతారు. జీవిత భాగస్వామిపై అనుబంధం రెట్టింపవుతుంది.

కన్యా రాశి : వ్యక్తి గత జీవితంలో సంతోషం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఉద్యోగం చేస్తున్నవారికి వృద్ధి ఉంది. కన్యారాశివారికి ఈ సమయంలో ప్రమోషన్లు పొందుతారు. ధన త్రయోదశి కారణంగా ఎలక్ట్రిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులు విజయవంతమవుతాయి.
కర్కాటక రాశి : వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు మంచి సమయం. ఈ సమయంలో ఎటువంటి పనులు చేసినా మంచి ఫలితాలు సాధిస్తారు.












Click it and Unblock the Notifications