జనవరిలో 3 రాజయోగాలు.. వీరే మహారాజులు
వేద జ్యోతిష్యం ప్రకారం జనవరి నెలలో అనేక శుభ రాజయోగాలు ఏర్పడుతున్నాయి. సూర్యుడు, అంగారకుడి కలయికవల్ల ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడింది. చంద్రుడు, బృహస్పతి కలయిక వల్ల గజకేసరి రాజయోగంతోపాటు ఆయుష్మాన్ యోగం కూడా ఏర్పడనుంది. వీటి ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ ప్రధానంగా మేషరాశి, మకర రాశి, వృషభరాశి వారికి బాగా కలిసిరానుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
మేష రాశి:వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. కోరికలన్నీ జనవరి నెలలోనే నెరవేరతాయి. డబ్బును పొదుపు చేస్తారు. చేసే పనిలో వృద్ధి నమోదవుతుంది. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలోనే ప్రారంభించాలి.

వృషభ రాశి:వాహన యోగం లేదంటే ఆస్తిని కొనుగోలు చేస్తారు. పనితోపాటు వ్యాపారంలో కూడా లాభాలున్నాయి. ప్రణాళికలన్నీ అనుకున్న ప్రకారం పూర్తయితే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వృత్తి రీత్యా లేదంటే వ్యాపార రీత్యా విదేశాలకు వెళతారు. ఇది బాగా కలిసివస్తుంది. అదృష్టం తోడుండటంవల్ల అంతా అనుకూలంగా జరుగుతుంది. ధైర్యం పెరుగుతుంది.
మకర రాశి:మూడు రాజయోగాలు ఈ రాశులవారికి ప్రతి పనిలోను విజయాన్ని చేకూరుస్తుంది. కొత్త పనిని ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలోనే ప్రారంభించవచ్చు. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. శ్రేయస్సుతోపాటు శోభ కూడా పెరుగుతుంది. తద్వారా ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధపడుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు.












Click it and Unblock the Notifications