ఈనెలలో అరుదైన రాజయోగం.. వీరికి ధనయోగం
కొత్త సంవత్సరంలో కలిసిరావాలని అందరూ కోరుకుంటారు. మన భవిష్యత్తు ఎలా ఉండాలి అనే విషయాన్ని గ్రహాలు నిర్ణయిస్తాయి. సూర్యుడు, అంగారకుడు ధనస్సు రాశిలో సంచారం చేయబోతున్నారు. కీర్తి ప్రతిష్టలకు కారకుడైన ఆదిత్యుడు, ధైర్యాన్ని ఇచ్చే కుజుడు ధనస్సు రాశిలో కలవడం వల్ల అరుదైన ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసిరానుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
మేషరాశి : వీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరడంతోపాటు ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో విజయాలను సాధిస్తారు. అందుకు అదృష్టం తోడుంటుంది. ఎంత శ్రమపడితే అంత ఫలితం దక్కుతుంది. ఉద్యోగం సాధించాలనే కోరిక కూడా నెరవేరుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ ఈ సమయంలో పూర్తిచేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు లేదంటే విహారయాత్రకు వెళతారు.

కన్య రాశి : ఉద్యోగం దొరుకుతుంది. పెద్దమొత్తంలో ఆస్తులను కొనుగోలు చేస్తారు. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగం మారాలనుకునేవారికి ఇది అనుకూల సమయం. వ్యాపారస్తులు లాభపడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీగా సంపాదన ఉంటుంది. కారును కొనుగోలు చేస్తారు.
మీనరాశి : ఈ నెల వీరికి ఎంతో బాగుంటుంది. ఆదాయం పెరగడంతోపాటు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఇంక్రిమెంట్ తో కూడిన ప్రమోషన్ వస్తుంది. ప్రేమ జీవితం విజయవంతమవుతుంది. కెరీర్ లో వృద్ధి ఉంది. స్టాక్ మార్కెట్ లేదంటే లాటరీలో పెట్టుబడి పెట్టినవారు లాభపడతారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేస్తారు. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది.












Click it and Unblock the Notifications