100 ఏళ్ల తర్వాత 3 రాజయోగాలు.. ఈ రాశులకు ఐశ్వర్యం
నవంబరు నెలలో 100 సంవత్సరాల తర్వాత ప్రత్యేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. సూర్యుడు, బుధుడు, కుజుడు కలయికవల్ల ఇవి ఏర్పడుతున్నాయి. శివపరిఘ యోగం, సర్వార్ధ సిద్ధి యోగం, బుధాదిత్య యోగం అంటారు. ఈనెల 16న అంగారకుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి, 17న సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నారు. అంతకు ముందుగా ఈనెల ఆరోతేదీన బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. ఇలా ఒకే రాశిలో త్రికోణ యోగం ఏర్పడటం చాలా అరుదని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీనివల్ల కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
మేష రాశి
కెరీర్ లో వృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. ఏ పని తలపెట్టిన కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు దొరుకుతుంది. వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటారు.

కర్కాటక రాశి
శుభవార్తలను వింటారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సత్వరమే పరిష్కారం దొరుకుతుంది. కుటుంబంలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులకు లాభాలున్నాయి.
కన్య రాశి
ఉద్యోగులకు వారి భవిష్యత్తుకు సంబంధించి మంచి ఫలితాలు అందుకుంటారు. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. ఆర్థికంగా లోటు లేదు. ఏ పని తలపెట్టినా పూర్తి అంకిత భావంతో పనిచేయాలి.
మకర రాశి
వ్యాపారస్తులకు ఒప్పందాలు కుదురుతాయి. వీటిద్వారా విశేష లాభాలున్నాయి. అంతేకాదు.. వ్యాపారాన్ని విస్తరిస్తారు. చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ అవగాహనతో ముందుకు వెళితే విజయం లభిస్తుంది. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నవారికి శుభవార్తలు వినపడతాయి.












Click it and Unblock the Notifications